
- మాజీ మంత్రి రజిని వట్ల సీఐ కీచకుడిలా వ్యవహరించాడు
- అసాల్ట్ కేసు పెడతానంటూ బెదిరించాడు
- పోస్టింగ్‌ల కోసం ఇంతగా దిగజారిపోవాలా?
- తక్షణమే సీఐపై చర్యలు తీసుకోవాలి
- పేర్ని నాని డిమాండ్
చిలుకలూరిపేట: మాజీ మంత్రి విడుదల రజిని పట్ల చిలుకలూరిపేట రూరల్ సీఐ సుబ్బనాయుడు సభ్యతా, సంస్కారాలను మరిచిపోయి కీచకుడిలా వ్యవహరించడాన్ని వైఎస్సార్‌సీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా ఖండించారు. చిలుకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజిని నివాసానికి వెళ్ళి ఆమెను పరామర్శించారు పేర్ని నాని.
ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు దొంతిరెడ్డి వేమారెడ్డి, డైమండ్‌బాబు తదితరులు విడదల రజినిని పరామర్శించిన వారిలో ఉన్నారు. దీనిలో భాగంగా పేర్ని నాని మాట్లాడుతూ.. ‘సీఐ సుబ్బారాయుడు పశువులా ప్రవర్తించారు. కుటుంబ సభ్యులు సీఐకు అన్నంతో పాటు సంస్కారం కూడా పెట్టాలి. వైఎస్సార్ సీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. శ్రీకాంత్ అరెస్ట్ పై కోర్టును ఆశ్రయిస్తాం’ అని స్పష్టం చేశారు.
నాపై సీఐ దౌర్జన్యం చేశారు..
వైఎస్సార్ సీపీ నేత అరెస్ట్ పై ప్రశ్నిస్తే పోలీసుల దర్జన్యం చేశారని మాజీ మంత్రి విడదల రజిని తెలిపారు. సీఐ సుబ్బారాయుడు టీడీపీ కార్యకర్తలా వ్యవహరించారు. నాపై కేసు పెడతానని బెదిరించారు. ఇప్పటికే మా కుటుంబ సభ్యులపై ఎన్నో కేసులు పెట్టారు’ అని విడదల రజిని పేర్కొన్నారు.
కాగా, మాజీ మంత్రి విడదల రజినిపై పోలీసులు దౌర్జన్యం చేశారు. పల్నాడు జిల్లా మానుకొండవారి పాలెంలో ఓ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన విడదల రజినిపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. ఓ కుటుంబాన్ని పరామర్శించడానికి కొంతమంది అనుచరులతో విడదల రజిని వెళితే.. అక్కడకు పోలీసులు భారీగా చేరుకుని నానా హంగామా స్పష్టించారు.

విడదల రజిని అనుచరుల్లో ఒకరైన శ్రీకాంత్ అనే వ్యక్తిని అరెస్ట చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. దీన్ని రజిని ప్రశ్నించారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలంటూ నిలదీశారు. ఈ క్రమంలో అక్కడున్న సీఐ పక్కకి పో అంటూ విడుదల రజిని పట్ల అనుచితంగా మాట్లడమే కాకుండా ఆమెను పక్కకు నెట్టేశారు. ఒక మహిళ, మాజీ మంత్రి, అని కూడా చూడకుండా పోలీసుల ప్రవర్తించిన తీరు ప్రస్తుత కూటమి ప్రభుత్వ అరాచక పాలనకు అద్దం పడుతోందని వైఎస్సార్‌సీపీ మండిపడుతోంది.