జెడ్పీటీసీలనూ కలుపుకొని పోవాలి
ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలతో నిత్యం మమేకమై ఉంటున్న జెడ్పీటీసీలను తమ గ్రామాల్లో అభివృద్ధి పనులు జరగడం లేదని ప్రజలు నిలదీస్తున్న పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. వారి అంగీకారం లేకుండా ఏకపక్షంగా పనుల ఆమోదం వద్దని, అజెండాలోని అంశాలపై సమగ్రంగా చర్చించేందుకు జెడ్పీటీసీలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. జెడ్పీటీసీలకు తెలియకుండా, వారి ఆమోదం పొందకుండా అజెండాలను ఆమోదించేందుకు తాము సిద్ధంగా లేమని స్పష్టం చేశారు.


