కేంద్రియ విద్యాలయంలో ఉద్యోగాలకు దరఖాస్తులు | - | Sakshi
Sakshi News home page

కేంద్రియ విద్యాలయంలో ఉద్యోగాలకు దరఖాస్తులు

Feb 22 2026 7:11 AM | Updated on Feb 22 2026 7:11 AM

కేంద్రియ విద్యాలయంలో ఉద్యోగాలకు దరఖాస్తులు

కేంద్రియ విద్యాలయంలో ఉద్యోగాలకు దరఖాస్తులు

కేంద్రియ విద్యాలయంలో ఉద్యోగాలకు దరఖాస్తులు జిల్లాలో శనగ కొనుగోలు ప్రక్రియ ప్రారంభం

తెనాలిఅర్బన్‌: తెనాలి జగ్గడిగుంటపాలెంలోని కేంద్రియ విద్యాలయంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు ప్రిన్సిపల్‌ శ్రీకాంత్‌ శనివారం ప్రకటనలో తెలిపారు. పీజీటీలో హిందీ, ఇంగ్లీషు, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, బయాలాజీ, టీజీటీలో హిందీ, ఇంగ్లీషు, సంస్కృతం, సోషల్‌, సైన్స్‌, మ్యాథ్స్‌, పీఆర్టీ స్టాఫ్‌ నోర్స్‌, కోచ్‌ ఫర్‌ స్పోర్ట్స్‌, కౌన్సిలర్‌, కంప్యూటర్‌ ఇన్‌స్ట్రక్టర్‌, ఒకేషనల్‌ ల్యాబ్‌ ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టులను తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 23వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని తెలిపారు. ఎంపికై న వారందరూ 2026–27 విద్యా సంవత్సరంలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. అర్హులైన వారు తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, బయోడేటాతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాల కోసం https:// tenali.kvs.ac.in వెబ్‌సైట్‌లో సంప్రదించాలన్నారు.

గుంటూరు వెస్ట్‌: జిల్లాలో శనగ కొనుగోలు ప్రక్రియ ప్రారంభించామని జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రవీ– 2025 – 26లో శనగ సాగు చేసిన రైతులు అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ప్రభుత్వం కనీస మద్దతు ధరగా రూ.5,875 ప్రకటించిందని తెలిపారు. జిల్లాలో 9 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి కొనుగోలు చేయ డం జరుగుతుందన్నారు. జిల్లాలో 13 మండలాల్లో సుమారు 16,600 హెక్టార్లలో శనగ పంట సాగు చేయగా, 45 వేల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి అంచనా ఉందని తెలిపారు. రైతులు పంటను దళారులకు అమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరకు విక్రయించాలని కోరారు. రైతులు తమ పరిధిలోని రైతు సేవా కేంద్రంలో సీఎం యాప్‌లో నమోదు చేసు కోవాలన్నారు. నమోదుకు సాగు చేసిన రైతే తప్పనిసరిగా రైతుసేవా కేంద్రానికి వెళ్లి తమ బయోమెట్రిక్‌ వేయాల్సి ఉంటుందని తెలిపారు. ఆధార్‌కు అనుసంధానమైన బ్యాంకు ఖాతా నంబర్‌ ఉన్న పట్టాదార్‌ పాస్‌బుక్‌, ఆధార్‌ కార్డ్‌ జిరాక్స్‌ ప్రతులు సమర్పించాలని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement