మాజీ మంత్రి విడదల రజినిపై పోలీసుల దౌర్జన్యం | AP Police Over Action on Vidadala Rajini | Sakshi
Sakshi News home page

మాజీ మంత్రి విడదల రజినిపై పోలీసుల దౌర్జన్యం

May 10 2025 3:35 PM | Updated on May 10 2025 4:43 PM

AP Police Over Action on Vidadala Rajini

పల్నాడు జిల్లా:  మాజీ మంత్రి విడదల రజినిపై పోలీసులు దౌర్జన్యం చేశారు. పల్నాడు జిల్లా మానుకొండవారి పాలెంలో ఓ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన విడదల రజినిపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. ఓ కుటుంబాన్ని పరామర్శించడానికి కొంతమంది  అనుచరులతో విడదల రజిని వెళితే.. అక్కడకు పోలీసులు భారీగా చేరుకుని నానా హంగామా స్పష్టించారు. 

విడదల రజిని అనుచరుల్లో ఒకరైన శ్రీకాంత్‌ అనే వ్యక్తిని అరెస్ట​  చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. దీన్ని రజిని ప్రశ్నించారు. ఎందుకు అరెస్ట్‌ చేస్తున్నారో చెప్పాలంటూ నిలదీశారు.  ఈ క్రమంలో  అక్కడున్న సీఐ పక్కకి పో అంటూ విడుదల రజిని పట్ల అనుచితంగా మాట్లడమే కాకుండా ఆమెను పక్కకు నెట్టేశారు. ఒక మహిళ, మాజీ మంత్రి, అని కూడా చూడకుండా  పోలీసుల ప్రవర్తించిన తీరు ప్రస్తుత కూటమి ప్రభుత్వ అరాచక పాలనకు అద్దం పడుతోంది.  

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై అనేక అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఇలానే విడదల రజినిపై కూడా అనేక అక్రమ కేసుల్ని బనాయించారు పోలీసులు.  వైఎస్సార్‌సీపీ శ్రేణులను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుండటంపై ప్రజలు తీవ్రంగా అసహ్యించుకుంటున్నారు  ఏపీలో పాలనను గాలికొదిలేసి కేవలం రెడ్‌ బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

మాజీ మంత్రి విడదల రజినిపై పోలీసుల దౌర్జన్యం


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement