సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లాలో టీడీపీ కూటమి అరాచకాలు కొనసాగుతున్నాయి. జిల్లాలోని లింగాలలో వైఎస్సార్‌సీపీ నేతలను అక్రమంగా అరెస్టు చేశారు. డీఐజీ కోయ ప్రవీన్ ఆదేశాలతోనే వైఎస్సార్‌సీపీ నేతల ముందస్తు అరెస్టులు జరుగుతున్నట్టు సమాచారం. వైఎస్సార్‌సీపీ నాయకులే టార్గెట్‌గా బైండోవర్ కేసులతో పాటు ఇతర కేసులను నమోదు జరుగుతోంది.
ఈ నెల 5న (గురువారం) జరగనున్న జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ పోలింగ బూత్‌లను కబ్జా చేసేందుకు కూటమి నేతలు సిద్దమైయ్యారు. పోలింగ్ బూత్‌లకి వైఎస్సార్‌సీపీ ఏజంట్లు రాకుండా ఎన్నికలు ఏకపక్షం చేసుకునేందుకు టీడీపీ కుట్రలు చేస్తోంది. తాజాగా జరిగిన మున్సిపాల్ ఎన్నికల్లో టీడీపీ కూటమి అడ్డదారుల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: అమెరికా సెనేటర్ అబ్దుల్ ఎల్-సయెద్ వెనుక భారతీయ వైద్యురాలు


