సాక్షి,తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి మాజీ ఛైర్మన్ డాక్టర్ ఏ. చక్రపాణి మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డితో చక్రపాణికి సన్నిహిత రాజకీయ, వ్యక్తిగత అనుబంధం ఉండేదని ఆయన గుర్తు చేసుకున్నారు. 2007లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శాసనమండలిని పునరుద్ధరించినప్పుడు, తొలి ఛైర్మన్‌గా చక్రపాణిని ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.
శాసనమండలి ఛైర్మన్‌గా పార్లమెంటరీ సంప్రదాయాల పరిరక్షణకు ఆయన విశేష కృషి చేశారని కొనియాడారు. చక్రపాణి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.


