ఇది నా ఉల్క, ఎవరికీ ఇవ్వను | santhekasalagere Village Sarpanch Oolka Incident | Sakshi
Sakshi News home page

ఇది నా ఉల్క, ఎవరికీ ఇవ్వను

Nov 6 2026 1:17 PM | Updated on Nov 6 2026 1:17 PM

santhekasalagere Village Sarpanch Oolka Incident

శిలతో దయానంద్‌

కర్ణాటక :  మండ్య తాలూకాలోని సంతేసలగెరె గ్రామ సర్పంచ్‌ కె.పి. దయానంద్‌ తన వద్ద రోదసి ఉల్క ఉందని చెబుతున్నాడు. పెరట్లో దొరికిన తేలికపాటి ఎరుపు రంగులో ఉన్న ఓ శిల గురించి ఆయన స్వయంగా ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాయగా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు శాస్త్రవేత్తల బృందం ఆయన నివాసానికి వెళ్ళింది, వారు తన నుంచి లాక్కొనే ప్రయత్నం చేశారని ఆరోపించాడు. దీని బరువు 13 గ్రాములు ఉందని తెలిపాడు.  

ఉల్కా.. రాయా?  
2024లో, ఆయన ఇంటి హాలులోని తులసి మొక్క కింద మట్టిలో ఇది లభించినట్లు  గురువారం మండ్యలో మీడియా సమావేశంలో ఆయన తెలిపాడు. ఏమిటో తెలుసుకోవడానికి మైసూరులోని ఇండియా జియోలాజికల్‌ ల్యాబ్‌కు వెళ్ళినప్పుడు, దానిపై సూర్యరశ్మి పడగా, అది ఒక అంతరిక్షం నుంచి పడిన ఇనుప ఉల్క అని నిపుణులు తెలిపారని చెప్పాడు. అయితే మైసూరు వర్సిటీ భూ విజ్ఞాన శాస్త్ర విభాగం నిపుణులు గ్రానైట్‌ రాయిగా తెలిపారు. 

దీనిని అంగీకరించని ఆయన ఈ శిల ఏమిటో గుట్టు విప్పాలని పీఎంఓకు లేఖ రాశారు. పీఎంఓ కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సిఫార్సు చేసింది. సీఎస్‌ సూచన మేరకు ఖనిజ శాస్త్రవేత్తలు ఆ వస్తువును హెమటైట్‌ శిల అని మౌఖికంగా చెప్పారన్నారు. వారి సూచన మేరకు మరిన్ని పరీక్షలకు బెంగళూరుకు తీసుకువెళ్లగా దానిని తమకు ఇవ్వాలన్నారని, తాను  నిరాకరించినట్లు చెప్పారు. ఈ శిల ఎంత విలువ చేస్తుందో అంత డబ్బు తనకు ఇస్తే అప్పగిస్తానని తెలిపాడు.    

ఇదీ చదవండి: రావణుడి సింహాసనం వెనుక నాలుగు నెలల కష్టం..ఖర్చు అక్షరాలా కోటి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement