బెంగళూరులో దారుణం.. క్యాబ్‌ డ్రైవర్‌ కిరాతకం | Bengaluru cabbie kills 7 in murder spree | Sakshi
Sakshi News home page

బెంగళూరులో దారుణం.. క్యాబ్‌ డ్రైవర్‌ కిరాతకం

Nov 6 2026 12:14 PM | Updated on Nov 6 2026 12:47 PM

Bengaluru cabbie kills 7 in murder spree

బెంగళూరు: భార్య పుట్టింటి వారితో మాట్లాడటాన్ని సహించలేకపోయాడా? ఆ కక్షతో ఏకంగా ఏడుగురి ప్రాణాలు తీశాడా? బెంగళూరులో వెలుగుచూసిన సామూహిక హత్యల ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది. భార్యతో పాటు ఆమె కుటుంబానికి చెందిన మరో ఆరుగురిని హత్య చేసినట్లు క్యాబ్‌ డ్రైవర్‌ ఇండుశేఖర్‌పై ఆరోపణలు వచ్చాయి. మృతుల్లో ఏడేళ్ల బాలుడు కూడా ఉన్నాడు.

పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. ఇండుశేఖర్‌ మొదట భార్య సునీతను హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. అనంతరం ఆమె సోదరులు శివకుమార్‌, శంకర్‌, వారి భార్యలు దివ్య, నళిని, అత్త రూపవతి, ఏడేళ్ల పునీత్‌ను పార్టీ పేరుతో ఇంటికి పిలిచినట్లు సమాచారం. అక్కడే వారిని హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

నంది హిల్స్‌ వద్ద బాలుడి మృతదేహం
మృతదేహాలను కారులో వివిధ ప్రాంతాలకు తరలించి పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నంది హిల్స్‌ సమీపంలో నాలుగు గంటల పాటు గాలింపు చేపట్టి ఏడేళ్ల పునీత్‌ మృతదేహాన్ని గుర్తించారు. మిగిలిన ఆరుగురి కోసం గాలింపు కొనసాగుతోంది. అయితే, సునీత తన పుట్టింటి వారితో తరచూ మాట్లాడటంపై ఇండుశేఖర్‌ అసంతృప్తిగా ఉండేవాడని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. ఈ కుటుంబ కలహాలే హత్యలకు కారణమై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

శ్రీరాంపుర పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన మిస్సింగ్‌ ఫిర్యాదు విచారణలో నిందితుడి పొంతనలేని సమాధానాలతో పోలీసులకు అనుమానం వచ్చింది. తదుపరి విచారణలో ఏడుగురి హత్యల వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఒక కుటుంబ వివాదం ఏడుగురి ప్రాణాలను బలిగొందా? మిగిలిన మృతదేహాలు ఎక్కడ ఉన్నాయి? ఈ ఘోర ఘటన వెనుక మరిన్ని విషయాలు బయటపడాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

ఇదీ చదవండి: పార్లమెంట్‌లో చర్చించే దమ్ముందా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement