యువతిని కాపాడిన మొసలి | Crocodile Save Life Woman In Bengaluru | Sakshi
Sakshi News home page

యువతిని కాపాడిన మొసలి

Nov 6 2026 8:51 AM | Updated on Nov 6 2026 9:01 AM

Crocodile Save Life Woman In Bengaluru

బెంగళూరు: ఇంట్లో గొడవలతో విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలని నదిలోకి  దూకిన యువతిని ఓ మొసలి కాపాడింది. ఇది వింతగా ఉన్నప్పటికీ వాస్తవమే. వివరాలు ఇలా ఉన్నాయి.. దక్షిణ కన్నడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కుక్కె సుబ్రమణ్యకు ఉడుపికి చెందిన యువతి బుధవారం రాత్రి వచ్చింది. అక్కడ ప్రవహించే కుమారధార నదిలోకి దూకింది. నీటిలో దూకిన వెంటనే ఆమె మీద ఓ మొసలి దాడి చేసింది. దీంతో గాయపడిన యువతి ప్రాణభయంతో కాపాడండి అని గట్టిగా కేకలు వేయసాగింది. 

సమీప అతిథి గృహం సిబ్బంది స్థానికులతో కలిసి ఆమెను నది నుంచి కాపాడి బయటకు తీసుకొచ్చారు. మొసలి కొరకడంతో ఆమెకు స్వల్ప గాయాలైనా, ఆత్మహత్య గండం తప్పింది. దేవుడే మొసలి రూపంలో వచ్చి ఆమెను కాపాడినట్లు స్థానికులు చెప్పుకొచ్చారు. పోలీసులు ఆమెను తీసుకెళ్లి విచారించగా కుటుంబ గొడవల వల్ల ఆత్మహత్య చేసుకోవాలని వచ్చినట్లు తెలిపింది. కుటుంబీకులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement