భార్య, కూతురిని కడతేర్చిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌! | Life imprisonment Family Incident | Sakshi
Sakshi News home page

భార్య, కూతురిని కడతేర్చిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌!

Nov 5 2026 7:25 AM | Updated on Nov 5 2026 7:34 AM

Life imprisonment Family Incident

భార్య, కూతురితో ముద్దాయి ప్రజ్వల్‌ (ఫైల్‌)

బెంగళూరు: మానమృగంలా మారి భార్య, కూతురును హత్య చేసిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుకి మైసూరు రెండో అదనపు జిల్లా సెషన్స్‌ న్యాయస్థానం జీవిత ఖైదు శిక్షను విధించింది. మైసూరు విజయనగర బసవనహళ్లి నివాసి ప్రజ్వల్‌ అలియాస్‌ రామచంద్ర  (43) శిక్షపడ్డ దోషి.  

ఉద్యోగం వదిలేసి..  
వివరాలు.. ప్రజ్వల్‌ బెంగళూరు ఐటీ ఇంజనీరుగా పనిచేసేవాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఉద్యోగం మానేసి మైసూరుకు వచ్చారు. పని లేకుండా మద్యానికి అలవాటు పడడంతో ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. భార్య సవిత (38)తో తరచూ ఘర్షణ పడుతూ మీ ఇంటి నుంచి డబ్బులు, ఆస్తిలో వాటా తీసుకుని రావాలని వేధించేవాడు. 2017, మే 23న సవితా పడుకున్న గదిలోకి వెళ్లి కత్తితో దాడి చేసి చంపేశాడు. బయట ఆడుకుంటూ ఉన్న కుమార్తె  సించన (9)ని లోపలకు పిలిచి బాలికను కూడా కిరాతకంగా కత్తితో పొడిచి ప్రాణాలు తీశాడు. మృతదేహాలను పై అంతస్తులోకి తరలించాడు.  

ఆత్మహత్యాయత్నం చేసి..  
మృతదేహాలతో పాటు ఉండి మూడో రోజు చనిపోవా­ల­ని క్రిమినాశక మందును తెచ్చుకున్నాడు. అయితే దానిని తాగలేక, కత్తితో చేయిని కోసుకుని ఆత్మహత్యా­యత్నం చేశాడు. చివరకు ఇరుగుపొరుగు చూసి విజయ­నగర పోలీసులకు సమాచారమిచ్చారు. వారు ఆ మృతదేహాలను, అతనిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స తరువాత కోలుకున్నాడు. పోలీసులు విచారించి నిందితుడిపై చార్జ్‌ïÙట్‌ దాఖలు చేశారు. అప్పటి నుంచి విచారణ సాగుతోంది. నేరం నిర్ధారణ కావడంతో బుధవారం న్యాయస్థానం ఆ ముద్దాయికి యావజ్జీవ జైలు శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement