కుమార్తెతో పనిమనిషి.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని హత్య! | businessman Incident house help caught with daughter | Sakshi
Sakshi News home page

కుమార్తెతో పనిమనిషి.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని హత్య!

Nov 5 2026 7:33 AM | Updated on Nov 5 2026 7:33 AM

businessman Incident house help caught with daughter

కర్ణాటక: ఇంట్లో తన కుమార్తెతో పట్టుబడిన పనిమనిషిని దారుణంగా హత్య చేశాడో వ్యాపారి. ఈ సంఘటన బెంగళూరులోని యలహంక పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన కిరణ్‌ (24) హతుడు కాగా,  తమిళనాడుకు చెందిన ఆనంద్‌ (45) నిందితుడు. వివరాలు.. ఆనంద్‌ స్వీట్‌కార్న్, తినుబండారాల తయారీ ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నాడు. అతని వద్ద కిరణ్‌ కొన్నేళ్లుగా పని చేస్తున్నాడు. ఆనంద్‌ పెద్ద కుమార్తె (19) మైసూరులో పీయూసీ చదవుతూ ఇటీవల సెలవులపై ఇంటికి వచ్చింది. ఆమెతో కిరణ్‌కు చనువు పెరిగి శారీరక సంబంధానికి దారితీసింది.  

ఊరికి వెళ్తున్నామని చెప్పి..  
మంగళవారం ఉదయం పనిమీద తమిళనాడుకు వెళ్తానని చెప్పి ఆనంద్‌ దంపతులు వెళ్లిపోయారు. అయితే రాత్రికి హఠాత్తుగా తిరిగివచ్చారు. ఆ సమయంలో ఇంట్లో కుమార్తెతో కిరణ్‌ ఏకాంతంగా ఉండడం చూసిన ఆనంద్‌ అగ్రహోదగ్రుడయ్యాడు. కుమార్తెను భార్యతో  బంధువుల ఇంటికి పంపించాడు. కిరణ్‌ని ఇంట్లోనే నిర్భంధించి బ్యాట్‌తో చితకబాదడంతో కుప్పకూలిపోయాడు. ఆనంద్‌ అతన్ని ఆటోలో ఆస్పత్రికి తీసికెళ్లగా అప్పటికే చనిపోయాడని వైద్యులు తెలిపారు. ఆస్పత్రి సిబ్బంది ఇచ్చిన సమాచారంతో పోలీసులు విచారించగా అంతా బయటపడింది. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేరళలోని కుటుంబీకులకు సమాచారమిచ్చారు. మరోవైపు నిందితున్ని అరెస్టు చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement