హైదరాబాద్: మీర్పేట్ పీఎస్ పరిధిలోని జయశ్రీ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులపై కత్తితో దాడి చేశాడు అల్లుడు. దీంతో ఇద్దరు మృతి చెందారు. తన అత్త, భార్య, కూతురు, మరొకరిపై నిందితుడు కత్తితో దాడి చేశాడు. దీంతో నిందితుడి అత్త నిరంజన్ బీ, బావమరిది భార్య రేష్మ మృతి చెందారు. బావమరిది యూసుఫ్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. కుటుంబ కలహాల వల్లే ఈ దాడి జరిగింది. ఉదయం పీఎస్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శలు వస్తున్నాయి.


