‘నీ కూతురిని చంపేశా’.. అత్తకు ఫోన్ చేసి చెప్పిన అల్లుడు | Karnataka Man Calls Mother In Law Then Surrenders Police | Sakshi
Sakshi News home page

‘నీ కూతురిని చంపేశా’.. అత్తకు ఫోన్ చేసి చెప్పిన అల్లుడు

Nov 5 2026 4:10 PM | Updated on Nov 5 2026 4:15 PM

Karnataka Man Calls Mother In Law Then Surrenders Police

Representative Image

బెంగళూరు: కర్ణాటకలో దారుణ హత్య ఘటన వెలుగుచూసింది. భార్యతో గొడవల నేపథ్యంలో ఓ వ్యక్తి ఆమె గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం అత్తకు ఫోన్ చేసి ‘నీ కూతురు పద్మను చంపేశాను’ అని చెప్పాడు. ఆ తర్వాత నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. బెంగళూరు సమీపంలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతురాలిని పద్మ (30)గా గుర్తించారు. ఆమె గౌరిబిదనూరు పట్టణానికి చెందినవారు. నిందితుడు ఆమె భర్త చంద్ర (34).

చిక్కబళ్లాపురం జిల్లాలోని తాటహళ్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. పద్మ తన పుట్టింటికి వెళ్లగా.. మాట్లాడాలని చెప్పి భర్త ఆమెను ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లాడు. గ్రామ శివారులోని ఓ తోటలో ఆమెను హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత గౌరిబిదనూరు గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం.

మరోవైపు నరసమ్మ సిద్ధలఘట్ట గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌లో హత్యపై ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలంలో పోలీసులు ప్రాథమికంగా పరిశీలించగా.. మృతురాలి మెడపై పదునైన ఆయుధంతో చేసిన లోతైన గాయం కనిపించింది. అలాగే కత్తితో పొడిచినట్లు అనుమానిస్తున్న మరో ఒకటి లేదా రెండు గాయాలను గుర్తించారు.

మృతురాలి తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. భార్యాభర్తల మధ్య దాదాపు రెండేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. అయితే హత్యకు కచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. తదుపరి దర్యాప్తులో అసలు కారణం వెల్లడికానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement