అత్యధిక మెజార్టీతో గెలుపొందిన సర్పంచ్‌ మృతి | Shankarapatnam Sarpanch Durgapu Sujatha Dies Due To Health Issue | Sakshi
Sakshi News home page

అత్యధిక మెజార్టీతో గెలుపొందిన సర్పంచ్‌ మృతి

Sep 21 2026 12:21 PM | Updated on Sep 21 2026 12:51 PM

Shankarapatnam Sarpanch Durgapu Sujatha Dies Due To Health Issue

మానకొండూర్‌(శంకరపట్నం): కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్‌ గ్రామ సర్పంచ్‌ దుర్గపు సుజాత (45) ఆదివారం అనారోగ్యంతో మృతిచెందారు. ఇటీవల ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన సుజాత కొంతకాలంగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించి ఆదివారం మృతిచెందారు. సర్పంచ్‌ మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ గ్రామానికి చేరుకుని సుజాత మృతదేహానికి పూలమాల వేసి, పార్టీ జెండా కప్పి నివాళి అర్పించారు. 

అనంతరం అంతిమయాత్రలో పాడెమోశారు. సర్పంచ్‌ మృతి తీరని లోటని, ఆమె చేసిన సేవలను గుర్తు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్‌గౌడ్, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు బండారి తిరుపతి, సహకార సంఘం చైర్మన్లు బసవయ్య, మహేశ్, సంపత్, మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ నాంపల్లి తిరుపతి, కాంగ్రెస్‌ శ్రేణులు, పలు గ్రామాల సర్పంచ్‌లు, నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. మృతురాలికి భర్త తిరుపతి, కొడుకు, కూతురు ఉన్నారు.

ఇదీ చదవండి: చెల్లిని కాపాడబోయి అక్క కూడా... కాసిందేవిపేటలో విషాదం!


 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement