వినాయక నిమజ్జనం.. ట్యాంక్‌బండ్‌పై ఉద్రిక్తత | Telangana: High Tension At Hyderabad's Tank Bund Over Ganesh Immersion | Sakshi
Sakshi News home page

వినాయక నిమజ్జనం.. ట్యాంక్‌బండ్‌పై ఉద్రిక్తత

Sep 21 2026 11:58 AM | Updated on Sep 21 2026 12:11 PM

Telangana: High Tension At Hyderabad's Tank Bund Over Ganesh Immersion

సాక్షి, హైదరాబాద్‌: వినాయక నిమజ్జన వేడుకల నిర్వహణ విషయమై ట్యాంక్‌బండ్‌పై ఉద్రిక్తత నెలకొంది. నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలని డిమాండ్‌ చేస్తూ గణేష్‌ ఉత్సవ సమితి సభ్యులు ఆందోళనకు దిగడంతో పోలీసులు, ఉత్సవ సమితి సభ్యుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది.

ట్యాంక్‌బండ్‌పై వినాయక నిమజ్జన వేడుకలు నిర్వహించాలని గణేష్‌ ఉత్సవ సమితి సభ్యులు డిమాండ్‌ చేశారు. అలాగే, జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు చేయని పక్షంలో తామే ఏర్పాట్లు చేసుకుంటామని ప్రకటించారు. ఈ క్రమంలో ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన బారికేడ్లను ఉత్సవ కమిటీ సభ్యులు తొలగించేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం ఉత్సవ సమితి సభ్యులు ట్యాంక్‌బండ్‌పై బైఠాయించి నిరసన తెలిపారు.  ట్యాంక్‌బండ్‌పైనే వినాయక నిమజ్జన వేడుకలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని ఉత్సవ సమితి సభ్యులు డిమాండ్‌ చేశారు. 

 

ఈ సందర్భంగా హుస్సేన్‌సాగర్‌లో గణేష్‌ నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లు తామే చేసుకుంటామని భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి రావినూతల శశిధర్‌ తెలిపారు. పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు, జీహెచ్‌ఎంసీ అధికారుల వైఫల్యం కారణంగానే నిమజ్జన ఏర్పాట్ల విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆయన అన్నారు. అలాగే, 2001లో ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వమే ఉత్తర్వులు ఇచ్చిందని పేర్కొన్నారు. హిందూ పండగలు వచ్చిన ప్రతిసారీ ఏదో ఒక కారణంతో నిమజ్జనంపై ఆంక్షలు విధించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. హుస్సేన్‌సాగర్‌లో ప్రజల విశ్వాసాలు, సంప్రదాయాలకు అనుగుణంగానే గణేష్‌ నిమజ్జనం కొనసాగుతుందని తెలిపారు.

అయితే, తమిళనాడులో జల్లికట్టుపై ప్రజల విశ్వాసాలను కాపాడిన తరహాలోనే హైదరాబాద్‌ గణేష్‌ భక్తుల విశ్వాసాలను కూడా ప్రభుత్వం గౌరవించి పరిరక్షించాలని రావినూతల కోరారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా నిమజ్జన కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు.

ఇదీ చదవండి: ఇది కాంగ్రెస్‌ తెచ్చిన కరువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement