వినాయకుడి దర్శనానికి వెళ్లి వస్తుండగా.. | Road Incident In Hyderabad | Sakshi
Sakshi News home page

వినాయకుడి దర్శనానికి వెళ్లి వస్తుండగా..

Sep 21 2026 7:55 AM | Updated on Sep 21 2026 8:04 AM

Road Incident In Hyderabad

హైదరాబాద్‌: గణపతి పూజకు వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా టిప్పర్‌ లారీ ఢీకొని యువతి, బాలుడు దుర్మరణం చెందిన ఘటన జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాప్రా ప్రశాంత్‌నగర్‌ కాలనీకి చెందిన సూర్యనారాయణరెడ్డి కుమార్తె దీప్తికారెడ్డి (21) బీటెక్‌ చదువుతోంది. శాలివాహన కాలనీలో నివసించే సూర్యనారాయణ స్నేహితుడు వినయ్‌ కుమారుడు అమర్త్య (15) పదో తరగతి చదువుతున్నాడు. 

శనివారం రాత్రి దీప్తికారెడ్డి, అమర్త్య కలిసి ప్రశాంత్‌నగర్‌ కాలనీలో గణపతి పూజకు వెళ్లారు. ఎల్లారెడ్డిగూడలోని శాలివాహన ఎన్‌క్లేవ్‌కు ద్విచక్ర వాహనంపై వస్తుండగా.. రాయల్‌ ఇరానీ కేఫ్‌ సమీపంలో మట్టిదిబ్బను తప్పించబోయి అదుపుతప్పి కింద పడిపోయారు. ఇదే సమయంలో వెనుక నుంచి వచి్చన టిప్పర్‌ లారీ దీప్తికారెడ్డి, అమర్త్యల తలలపై నుంచి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.   

ఇదీ చదవండి: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement