సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య | Woman Software employee Ends Life In Hyderabad | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య

Sep 21 2026 7:25 AM | Updated on Sep 21 2026 7:49 AM

Woman Software employee Ends Life In Hyderabad

హైదరాబాద్‌: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని అనుమానాస్పద స్థితిలో అత్మహత్య చేసుకుంది. పోచారం ఐటీ కారిడార్‌ పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మౌనిక సంతోషి (28) పోచారం ఐటీ కారిడార్‌లోని యాక్సిస్‌ బ్యాంక్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తోంది. వైజాగ్‌కు చెందిన రమాకాంత్‌ను ప్రేమించి 8 ఏళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కవల కుమారులు(2) ఉన్నారు. పోచారంలోని సంస్కృతి టౌన్‌షిప్‌ సమీపంలో నివాసముంటున్నారు. రమాకాంత్‌ ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్‌ హెచ్‌ఆర్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. 

ఆదివారం ఉదయం తలుపులు తెరిచి ఉండటంతో పనిమనిషి ఇంట్లోకి వచ్చి చూడగా మౌనిక ఉరి వేసుకున్న స్థితిలో కనిపించింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శనివారం రాత్రే ఈ ఘటన జరిగి ఉండొచ్చని, ఆ సమయంలో భర్త ఇంట్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. మౌనిక మృతికి భర్త వేధింపులే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు మృత దేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతికి గల కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. తల్లిని కోల్పోయి, కవల చిన్నారులున్న కుటుంబంలో విషాదం నెలకొంది.

ఇదీ చదవండి: డబుల్‌ బెడ్రూం ఇళ్ల మీకొద్దంటే..ఇతరులకిస్తాం


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement