breaking news
Ganesh utsav
-
డల్లాస్ లో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు
-
గణేష్ ఉత్సవాల్లో విషాదం.. స్టేజ్‌పైనే కుప్పకూలాడు
వైరల్: మనిషి జీవితం.. ఈరోజుల్లో నీటి బుడగలా మారిపోయింది. సీసీ కెమెరాలు, సెల్‌ఫోన్ రికార్డింగ్‌ల వల్ల.. ఉన్నట్లుండి కుప్పకూలి మరణిస్తున్న ఘటనలు చాలామట్టుకు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ యువకుడు నాటక సమయంలోనే స్టేజ్‌పై కుప్పకూలి కన్నుమూశాడు. గణేష్ ఉత్సవాల సందర్భంగా.. యోగేష్ గుప్తా అనే ఆర్టిస్ట్ పార్వతి దేవి గెటప్ వేసి నాటకంలో పాల్గొన్నాడు. నాటకంలో భాగంగా నృత్యం చేసిన యోగేష్.. ఉన్నట్లుండి కింద పడిపోయాడు. అదీ నాటకంలో భాగమే అనుకుని పొరపడిన శివుడి పాత్రధారి యువకుడు.. దగ్గరగా వచ్చి లేపబోయాడు. కానీ, యోగేష్‌లో చలనం లేదు. దీంతో నిర్వాహకులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే యోగేష్ గుండెపోటు మృతి చెందినట్లు నిర్ధారించారు. దేశవ్యాప్తంగా గత కొన్నిరోజలుగా ఇలాంటి ఆకస్మిక మరణాలకు సంబంధించిన ఉదంతాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. మలయాళం దిగ్గజ గాయకుడు ఎడవ బషీర్ సైతం ఇలాగే మే 28వ తేదీన అలపుజ్జాలో ప్రదర్శన ఇస్తూ కుప్పకూలి మృతి చెందారు. అలాగే.. ఈ ఏడాది జూన్‌లో ప్రముఖ సింగర్ కృష్ణకుమార్ కున్నాత్ అలియాస్ కేకే.. ప్రదర్శనలో ఇబ్బందిగా ఫీలై.. ఆ తర్వాత గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. వీళ్లే కాదు.. చాలా చోట్ల ఇలా మరణించిన ఘటనల తాలుకా వీడియోలు వైరల్ కావడం చూశాం. #WATCH | One more youth died with cardiac arrest..! Youth named #YogeshGupta who was performing the role of Maa Parvati during a Jagran in Bishnah Tehsil of #Jammu collapsed while dancing and died. He suffered a cardiac arrest. pic.twitter.com/dMRsy8M7up — Subodh Kumar (@kumarsubodh_) September 8, 2022 -
పచ్చ రంగు పులుముకున్న గణేష్ ఉత్సవాలు
-
లంబోదరుడు వినాయకచవితికి స్పెషల్ ఎట్రాక్షన్
-
గణేశ్ ఉత్సవాల తర్వాతే కోడ్
ఎన్నికల సంఘానికి ఉత్సవ మండళ్ల విజ్ఞప్తి సాక్షి, ముంబై: గణేశ్ ఉత్సవాల తర్వాతే ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలు చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేయాలని సార్వజనిక గణేశ్ ఉత్సవ మండళ్లు నిర్ణయించాయి. ఒకవేళ అంతకు ముందే కోడ్ అమల్లోకి వస్తే రాజకీయ పార్టీల నుంచి గణేశ్ ఉత్సవ మండళ్లకు రావల్సిన ఆదాయానికి భారీగా గండిపడుతుందని ఉత్సవ కమిటీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో మండళ్లు ఆర్థికంగా నష్టపోకుండా ఉండేందుకు ఉత్సవాల తరువాత ఎన్నికల కోడ్ అమలు చేయాలని విజ్ఞప్తి చేయనున్నాయి. ఈ ఏడాది గణేశ్ ఉత్సవాలు ఆగస్టు 29 నుంచి సెప్టెంబరు 8వ తేదీ వరకు జరుగనున్నాయి. అదే సమయంలో రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో గణేశ్ మండళ్లకు ఆర్థికంగా నష్టపోతామేమోననే దిగులు పట్టుకుంది. ఏటా ఉత్సవాలు నిర్వహించే మండళ్లు తమ పరిధిలోకి వచ్చే చాల్స్, భవనాలు, సొసైటీల ఇళ్లు, షాపుల నుంచి చందా రూపంలో డబ్బును పోగు చేస్తాయి. అయితే ఉత్సవాలు ఘనంగా నిర్వహించే మండళ్లకు ఈ నిధులు ఎటూ సరిపోవు. రాజకీయ నాయకులు అందజేసే భారీ విరాళాలతో ఉత్సవాలను ఘనంగా జరుపుతారు. ఉత్సవాలు జరిగే పరిసరాల్లో, మండపం ఆవరణలో ఏర్పాటుచేసే బ్యానర్లు, కటౌట్లు, ప్రవేశ ద్వారాలు, ఇతర ప్రకటనలు ఏర్పాటు చేసినందుకు వచ్చే ఆదాయం కూడా భారీగానే ఉంటుంది. ఒకవేళ ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే వీటిని ఏర్పాటు చేయడానికి వీలుండదు. అంతేకాక రాజకీయ నాయకులు మండళ్లకు చందా రూపంలో అందజేస్తే డబ్బు పంపిణీ కేసు నమోదవుతుంది. ఇక మండళ్లు ప్రచురించే సావనీర్లో కూడా నాయకుల ఫొటోలు ముద్రించినందుకు కూడా కొంత ఆదాయం వస్తుంది. అయితే ఎన్నికల కోడ్ అమలులోకి రావడంవల్ల ఇలా ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాన్ని కోల్పోవడం తోపాటు అనేక రకాలుగా సార్వజనిక గణేశ్ ఉత్సవ మండళ్లు నష్టపోతాయి. ఉత్సవాలు జరుగుతున్న సమయంలోనే కాకుండా నిమజ్జనోత్సవాలపై కూడా దీని ప్రభావం పడుతుంది. ప్రధాన కూడళ్ల వద్ద ఏర్పాటుచేసే వేదికపై ముఖ్యమంత్రితోసహా ఇతర శాఖల మంత్రులు, మేయర్, వివిధ పార్టీల ప్రతినిధులు నిలబడి గణేశ్ విగ్రహాలపై పూలుచల్లడం, భక్తులకు ధన్యవాదాలు తెలుపడం వంటివి చేస్తారు. కోడ్ అమల్లోకి వస్తే ఇలాంటి వాటికి కూడా నేతలు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయాలని నిర్ణయించినట్లు బృహన్ ముంబై సార్వజనిక గణేశ్ ఉత్సవ సమన్వయ సమితి అధ్యక్షుడు అడ్వొకేట్ నరేశ్ దహిబావ్కర్ తెలిపారు.