వీడియో: గణేష్‌ ఉత్సవాల్లో విషాదం.. పార్వతి గెటప్‌లో డ్యాన్స్‌.. ఉన్నట్లుండి కుప్పకూలి..

Jammu Kashmir: Parvati Role Youth Dies After Sudden Collapsed - Sakshi

వైరల్‌: మనిషి జీవితం.. ఈరోజుల్లో నీటి బుడగలా మారిపోయింది.  సీసీ కెమెరాలు, సెల్‌ఫోన్‌ రికార్డింగ్‌ల వల్ల..  ఉన్నట్లుండి కుప్పకూలి మరణిస్తున్న ఘటనలు చాలామట్టుకు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ యువకుడు నాటక సమయంలోనే స్టేజ్‌పై కుప్పకూలి కన్నుమూశాడు. 

గణేష్‌ ఉత్సవాల సందర్భంగా.. యోగేష్‌ గుప్తా అనే ఆర్టిస్ట్‌ పార్వతి దేవి గెటప్‌ వేసి నాటకంలో పాల్గొన్నాడు. నాటకంలో భాగంగా నృత్యం చేసిన యోగేష్‌.. ఉన్నట్లుండి కింద పడిపోయాడు. అదీ నాటకంలో భాగమే అనుకుని పొరపడిన శివుడి పాత్రధారి యువకుడు.. దగ్గరగా వచ్చి లేపబోయాడు. కానీ, యోగేష్‌లో చలనం లేదు. 

దీంతో నిర్వాహకులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే యోగేష్‌ గుండెపోటు మృతి చెందినట్లు నిర్ధారించారు. దేశవ్యాప్తంగా గత కొన్నిరోజలుగా ఇలాంటి ఆకస్మిక మరణాలకు సంబంధించిన ఉదంతాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. 

మలయాళం దిగ్గజ గాయకుడు ఎడవ బషీర్‌ సైతం ఇలాగే మే 28వ తేదీన అలపుజ్జాలో ప్రదర్శన ఇస్తూ కుప్పకూలి మృతి చెందారు. అలాగే.. ఈ ఏడాది జూన్‌లో ప్రముఖ సింగర్‌ కృష్ణకుమార్‌ కున్నాత్‌ అలియాస్‌ కేకే.. ప్రదర్శనలో ఇబ్బందిగా ఫీలై.. ఆ తర్వాత గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. వీళ్లే కాదు.. చాలా చోట్ల ఇలా మరణించిన ఘటనల తాలుకా వీడియోలు వైరల్‌ కావడం చూశాం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top