
హఠాన్మరణాల గణాంకాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా.. చిన్న వయసులో గుండె సంబంధిత సమస్యలతో చనిపోతున్న వాళ్ల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. తాజాగా 37 ఏళ్ల వ్యక్తి వర్కౌట్ చేస్తూ ఆకస్మాత్తుగా కుప్పకూలిపోగా.. గుండెపోటుతోనే మరణించాడని వైద్యులు ప్రకటించారు.
మహారాష్ట్రలోని పుణేలోని పింప్రీ-చిన్చ్వడ్‌లో మిలింద్ కులకర్ణి అనే వ్యక్తి వర్కౌట్ అనంతరం నీరు తాగుతూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. ఇది జిమ్‌లోని CCTV కెమెరాలో రికార్డైంది. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించినా, వైద్యులు అతను అప్పటికే మృతిచెందినట్టు ప్రకటించారు. గుండెపోటు కారణంగా కులకర్ణి చనిపోయాడని వైద్యులు ప్రకటించారు.
కులకర్ణి భార్య వైద్యురాలు. గత ఆరు నెలలుగా అతను జిమ్‌కు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా, పర్యవేక్షణతో వ్యాయామం చేయడం ఎంత ముఖ్యమో తెలియజేస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

జిమ్‌లో ఆకస్మిక మరణాల కారణాలు అనేకం ఉండొచ్చు. అయితే..
- హైపర్‌ట్రోఫిక్ కార్డియోమయోపతి (HCM).. ఇది వంశపారంపర్యంగా వచ్చే గుండె కండరాల లావుదల, వ్యాయామ సమయంలో గుండె చలనం ఆగిపోయే ప్రమాదం ఉంది.
- కార్డియాక్ అరెస్ట్.. రక్తనాళాల్లో బ్లాక్‌లు ఉండటం వల్ల గుండె హఠాత్తుగా ఆగిపోతుంది. అలాగే.. తిన్నాక వ్యాయామం చేయడం వల్ల ఊపిరితిత్తులకు ఒత్తిడి వచ్చి ప్రమాదం కలగొచ్చు. ఇంతేకాదు..
- స్టెరాయిడ్ వినియోగం.. కొంతమంది స్టెరాయిడ్లు(అనధికారిక) వాడటం వల్ల గుండె కండరాలు అధిక ఒత్తిడికి గురై, వ్యాయామ సమయంలో ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- కేవలం గండె సంబంధిత సమస్యలే కాదు.. వర్కౌట్‌లు చేసే సమయంలో బ్రెయిన్ ఎటాక్ (aneurysm rupture) వల్ల కూడా మరణాలు సంభవించిన సందర్భాలు ఉన్నాయి. ఈ స్థితిలో మెదడులో రక్తనాళాలు పగిలి మరణించే అవకాశం ఉంటంది.
జిమ్.. జాగ్రత్తలు
- జిమ్‌లకు వెళ్లేవాళ్లు.. వెళ్లాలనుకుంటున్నవాళ్లు.. ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిది
- కుటుంబంలో గుండెజబ్బుల చరిత్ర ఉంటే, మరింత జాగ్రత్త అవసరం.
- ఆహారం తర్వాత తక్షణం వ్యాయామం చేయకూడదు.
- అనధికారిక స్టెరాయిడ్లు, అధిక బరువులు ఎత్తడం వంటి చర్యలు నివారించాలి.
#Maharashtra #Pune के पिंपरी चिंचवड में जिम में वर्कआउट के दौरान एक शख्स को आया हार्ट अटैक; अस्पताल पहुंचने से पहले हुई मौत..पूरी घटना CCTV में कैद..37 साल के शख्स की हुई मौत..@TNNavbharat @PCcityPolice pic.twitter.com/X7Nun52YpZ
— Atul singh (@atuljmd123) August 2, 2025