తెలంగాణ: ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి అక్కాచెల్లెళ్లు మృతి చెందారు. ములుగు జిల్లా కాసిందేవిపేట గ్రామంలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. ములుగు మండలం కాసిందేవిపేట గ్రామానికి చెందిన మహ్మద్ అంజాద్‌పాషా తన కుటుంబ సభ్యులతో కలిసి పత్తి చేనుకు పురుగు మందు కొట్టేందుకు వెళ్లాడు.
కాగా, తల్లిదండ్రులు పత్తి చేనుకు పురుగు మందు కొడుతున్న సమయంలో పిల్లలు సమ్యాన్ (19), ఆసియా (10) పక్కన ఉన్న పంట పొలంలో నీటి గుంత వద్దకు కాళ్లు కడుక్కునేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ఆసియా కాళ్లు కడుక్కుంటూ ప్రమాదవశాత్తు నీటి గుంతలో మునిగిపోతుండగా.. చెల్లిని కాపాడేందుకు అక్క సమ్యాన్ నీటి గుంతలోకి దిగింది.
కాగా, పిల్లలు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. అనుమానంతో పక్కనే ఉన్న నీటి గుంత వద్దకు వెళ్లి చూడగా మునిగిపోతూ కనిపించారు. వెంటనే నీటిగుంతలోకి దిగి పిల్లలను ఒడ్డుకు తీసి కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఒకే కుటుంబానికి చెందిన అక్కా చెల్లెళ్లు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి: తల్లిని చంపి.. మృతదేహంపై బిడ్డను వదిలేశారు


