కర్ణాటక: సీఎం, తమ తండ్రి డీకే శివకుమార్ కుమార్తె ఐశ్వర్య ఆయన ముందే ప్రభుత్వ పాఠశాలల దుస్థితిపై పలు విమర్శలు చేశారు. గురువారం నాడు విధానసౌధలో ప్రభుత్వ పాఠశాలల వికాసంపై జరిగిన సమావేశంలో ఐశ్వర్య ప్రసంగిస్తూ తాము కనకపురలోని దొడ్డాలహళ్లి గ్రామంలోని పాఠశాలను దత్తత తీసుకున్నప్పుడు 400 మంది విద్యార్థులు ఉన్నారని, పలు సంఘ సంస్థలు ఇచ్చిన కంప్యూటర్, రోబోటిక్స్, ఐఓటీ ల్యాబ్‌లు ఉన్నప్పటికీ వాటి గురించి బోధించే ఉపాధ్యాయులు లేరన్నారు.
ప్రభుత్వం పరికరాలు ఇచ్చి చేతులు దులుపుకొంటే సరిపోదని, ఇచ్చినవి సద్వినియోగం అయ్యేలా చూడాలన్నారు. రూ.1లక్ష జీతం తీసుకునే ఉపాధ్యాయులు పాఠశాలలకు సరిగా రావడం లేదని, సరిగా పాఠాలు చెప్పడం లేదన్నారు. గ్రామాలకు బస్సులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఉపాధ్యాయులు సరిగా పనిచేసేలా, బస్సులు నడిపేలా చూడాలని తండ్రికి విన్నవించారు. ఈ మాటలతో సీఎంతో సహా అధికారులు కంగుతిన్నారు.
ఇదీ చదవండి: వారెవ్వా.. 104.27 శాతం పోలింగ్


