గోల్డ్‌ గెలిచినా పట్టించుకోలేదా?.. ఆమెకు ఏకంగా రూ. 1.80 కోట్లు! | Karnataka Govt Huge Hikes Cash Rewards Asian Games Medal Winners | Sakshi
Sakshi News home page

గోల్డ్‌ గెలిచినా పట్టించుకోలేదా?.. ఆమెకు ఏకంగా రూ. 1.80 కోట్లు!

Oct 6 2026 4:22 PM | Updated on Oct 6 2026 5:08 PM

Karnataka Govt Huge Hikes Cash Rewards Asian Games Medal Winners

ఎంఆర్‌ పూవమ్మ (పాత ఫొటో.. PC: Instagram)

కర్ణాటక ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. జపాన్‌ వేదికగా ఆసియా క్రీడల్లో పతకాలు గెలిచిన క్రీడాకారులపై కనక వర్షం కురిపించింది. తద్వారా తమపై వస్తున్న విమర్శలకు చెక్‌ పెట్టింది. కాగా ఆసియా క్రీడలు-2026 టోర్నీలో కర్ణాటక అథ్లెట్‌ ఎంఆర్‌ పూవమ్మ.. కిరణ్‌ మహల్‌, ప్రాచీ ఛౌదరి, విత్య రామ్‌రాజ్‌తో కలిసి మహిళల రిలే పరుగులో స్వర్ణం గెలిచింది.

అయితే, గోల్డ్‌ గెలిచినప్పటికీ ప్రభుత్వం నుంచి పూవమ్మను ఎవరూ అభినందించలేదనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో పూవమ్మ పసిడి గెలిచిన రెండు రోజుల తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌, డిప్యూటీ సీఎం పరమేశ్వర ఆమెకు ఫోన్‌ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన పూవమ్మ.. పతకాలు గెలిచిన వారికి ఘనమైన సత్కారాలు చేయడంతో పాటు.. భారీగా ప్రైజ్‌మనీ ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో తాజాగా కర్ణాటక ప్రభుత్వం చేసిన ప్రకటన ద్వారా సీఎం హామీ నెరవేర్చుకున్నట్లు అయింది. తమ రాష్ట్రం నుంచి ఆసియా క్రీడల్లో పాల్గొన్న అందరు ఆటగాళ్లలో ఒక్కొక్కరికి రూ. 5 లక్షల నగదు ప్రోత్సాహకంగా అందజేస్తామని తెలిపింది.

క్యాష్‌ రివార్డులలో భారీగా పెంపుదల
అదే విధంగా ఆసియా క్రీడల్లో పతకాలు గెలిచిన క్రీడాకారులను సీఎం డీకే శివ కుమార్‌ ఘనంగా సత్కరిస్తారని తెలిపింది. అంతేకాదు.. విజేతలకు అందజేసే క్యాష్‌ రివార్డును భారీగా పెంచినట్లు ప్రకటించింది.

రూ. 35 లక్షల నుంచి రూ. కోటికి
స్వర్ణ పతకం గెలిచిన వారికి రూ. 35 లక్షల నుంచి రూ. కోటికి, రజతం పొందిన వారికి రూ. 25 లక్షల నుంచి రూ. 75 లక్షలకు.. కాంస్య పతకం అందుకున్న వారికి రూ. 15 లక్షల నుంచి రూ. 50 లక్షలకు నజరానా పెంచినట్లు తెలిపింది. కొత్త జీవో ద్వారా క్రీడాకారులకు ఈ మేరకు క్యాష్‌ అవార్డు ఇస్తామని కర్ణాటక యువజన, క్రీడా శాఖ మంగళవారం ప్రకటన విడుదల చేసింది.

పాల్గొన్నది వీరే
కాగా కర్ణాటక నుంచి ఆసియా క్రీడలు-2026 టోర్నీలో యశ్‌ పలాక్ష, సుప్రియ సోందిగర బసవరాజు, ఉన్నతి అయ్యప్ప, ఎంఆర్‌ పూవమ్మ, స్నేహా ఎస్‌ఎస్‌, ఆయుశ్‌ శెట్టి, శ్రేయాంక ఆర్‌.పాటిల్‌, కిరణ్‌ రంగమణి, ఫౌవాద్‌ మీర్జా, అదితి అశోక్‌, ప్రణవి ఎస్‌. ఆరస్‌, మోహిత్‌ హెచ్‌ఎస్‌, తిలోత్తమ సేన్‌, ఆకాశ్‌ మణి, శ్రీహరి నటరాజ్‌ తదితరులు ఉన్నారు.

ఆమెకు ఏకంగా రూ. 1.75 కోట్లు!
వీరిలో ఎనిమిది మంది పతకాలను ముద్దాడారు. భారత మహిళల క్రికెట్‌ జట్టు తరఫున శ్రేయాంక స్వర్ణం గెలవడం ద్వారా రూ. కోటి నజరానా అందుకోనుంది. ఇక అథ్లెట్‌, ఎంఆర్‌ పూవమ్మ మహిళల రిలే పరుగులో స్వర్ణానికి కోటి, మిక్స్‌డ్‌ టీమ్‌లో రజతం గెలిచి రూ. 75 లక్షలు అందుకోనుంది. 

వీరికి కూడా భారీ నజరానాలు
తిలోత్తమ సేన్‌ 50 మీటర్ల రైఫిల్‌ టీమ్‌ ఈవెంట్లో సిల్వర్‌ గెలిచినందుకు గానూ రూ. 75 లక్షలు. బ్యాడ్మింటన్‌లో కాంస్యం గెలిచినందుకు ఆయుశ్‌ శెట్టి రూ. 50 లక్షలు, అథ్లెటిక్స్‌లో స్నేహ రజతానికి రూజ 50 లక్షలు అందుకోనున్నారు.

మరోవైపు.. గోల్ఫ్‌ టీమ్‌ మహిళల ఈవెంట్లో అదితి అశోక్‌, ప్రణవి రజతం గెలిచి రూ. 75 లక్షలు అందుకోనున్నారు. ఇక వ్యక్తిగత విభాగంలో స్వర్ణం గెలిచినందుకు ప్రణవికి అదనంగా రూ. కోటి నజరానా అందనుంది. పసిడి గెలిచిన పురుషుల హాకీ జట్టులో భాగమైన మోహిత్‌కు రూ. కోటి రానున్నాయి.అయితే దీనితో పాటు క్రీడల్లో పాల్గొన్నందుకు గానూ ప్రోత్సాహకంగా అదనంగా తలా ఐదు లక్షలు కూడా లభిస్తాయి.

చదవండి: నాశనం చేస్తున్నారు: గంభీర్‌, గిల్‌పై మాజీ క్రికెటర్‌ ఫైర్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement