Photo Credit: Twitter
భారత క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ ఇటీవలే ఆసియా గేమ్స్‌లో స్వర్ణం గెలిచిన భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. కాగా గురువారం ఢిల్లీలోని అశోకా హోటల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఆసియా గేమ్స్‌లో పతకాలు సాధించిన అథ్లెట్లను, భారత జట్లను ప్రత్యేకంగా అభినందించారు.
ఆసియా గేమ్స్ పురుషుల క్రికెట్ ఫైనల్లో శ్రేయస్ అయ్యర్ సేన పాకిస్తాన్‌ను చిత్తు చేసి వరుసగా రెండోసారి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన వేడుకకు ప్రస్తుతం బీసీసీఐ డైరెక్టర్‌గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్ కూడా హాజరయ్యాడు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రధాని మోదీపై ‘ఎక్స్’ వేదికగా ప్రసంశలు కురిపించాడు.
‘మన ఆసియా క్రీడల పతక విజేతల సన్మాన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలవడం, ఆయన స్ఫూర్తిదాయకమైన మాటలు వినడం గౌరవంగా భావిస్తున్నాను. భారత క్రీడల అభివృద్ధి పట్ల ఆయనకున్న అభిరుచిని, నిబద్ధతను చూడటం నిజంగా స్ఫూర్తిదాయకంగా ఉంది. దేశానికి పతకాలు అందించిన వేళ కేంద్రం ఇలా చొరవ తీసుకొని ఆటగాళ్లను సన్మానించడం చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తోంది.’ అని రాసుకొచ్చాడు.
సమావేశం సందర్భంగా హాకీ ఆటగాళ్లు తాము సంతకాలు చేసిన జెర్సీలతో పాటు హాకీ స్టిక్‌లు, శాలువాను ప్రధాని నరేంద్ర మోదీకి బహుకరించారు. మహిళల జట్టు కెప్టెన్ సలీమా టిటే ప్రధాని మోదీకి తన హాకీ స్టిక్‌ను గిఫ్ట్‌గా ఇవ్వడం విశేషం. ఇక జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ 85 పతకాలు సాధించింది. ఇందులో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలున్నాయి. 2023 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో భారత్ పతకాలు సంఖ్య వంద దాటగా, ఈసారి మాత్రం 90లోపే పరిమితమైంది. అయితే పట్టికలో మాత్రం తమ నాలుగో స్థానాన్ని కాపాడుకుంది.
An honour to meet Hon’ble Prime Minister Shri Narendra Modi ji and listen to his inspiring words at the felicitation ceremony for our Asian Games medallists. It was truly motivating to witness his passion and commitment to the growth of Indian Sports 🙏🙏 https://t.co/HNNAKTFMSK
— VVS Laxman (@VVSLaxman281) October 15, 2026
ఇదీ చదవండి:


