breaking news
MR Poovamma
-
గోల్డ్ గెలిచినా పట్టించుకోలేదా?.. ఆమెకు ఏకంగా రూ. 1.80 కోట్లు!
కర్ణాటక ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. జపాన్ వేదికగా ఆసియా క్రీడల్లో పతకాలు గెలిచిన క్రీడాకారులపై కనక వర్షం కురిపించింది. తద్వారా తమపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టింది. కాగా ఆసియా క్రీడలు-2026 టోర్నీలో కర్ణాటక అథ్లెట్ ఎంఆర్ పూవమ్మ.. కిరణ్ మహల్, ప్రాచీ ఛౌదరి, విత్య రామ్‌రాజ్‌తో కలిసి మహిళల రిలే పరుగులో స్వర్ణం గెలిచింది.అయితే, గోల్డ్ గెలిచినప్పటికీ ప్రభుత్వం నుంచి పూవమ్మను ఎవరూ అభినందించలేదనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో పూవమ్మ పసిడి గెలిచిన రెండు రోజుల తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, డిప్యూటీ సీఎం పరమేశ్వర ఆమెకు ఫోన్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన పూవమ్మ.. పతకాలు గెలిచిన వారికి ఘనమైన సత్కారాలు చేయడంతో పాటు.. భారీగా ప్రైజ్‌మనీ ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు.ఈ నేపథ్యంలో తాజాగా కర్ణాటక ప్రభుత్వం చేసిన ప్రకటన ద్వారా సీఎం హామీ నెరవేర్చుకున్నట్లు అయింది. తమ రాష్ట్రం నుంచి ఆసియా క్రీడల్లో పాల్గొన్న అందరు ఆటగాళ్లలో ఒక్కొక్కరికి రూ. 5 లక్షల నగదు ప్రోత్సాహకంగా అందజేస్తామని తెలిపింది.క్యాష్ రివార్డులలో భారీగా పెంపుదలఅదే విధంగా ఆసియా క్రీడల్లో పతకాలు గెలిచిన క్రీడాకారులను సీఎం డీకే శివ కుమార్ ఘనంగా సత్కరిస్తారని తెలిపింది. అంతేకాదు.. విజేతలకు అందజేసే క్యాష్ రివార్డును భారీగా పెంచినట్లు ప్రకటించింది.రూ. 35 లక్షల నుంచి రూ. కోటికిస్వర్ణ పతకం గెలిచిన వారికి రూ. 35 లక్షల నుంచి రూ. కోటికి, రజతం పొందిన వారికి రూ. 25 లక్షల నుంచి రూ. 75 లక్షలకు.. కాంస్య పతకం అందుకున్న వారికి రూ. 15 లక్షల నుంచి రూ. 50 లక్షలకు నజరానా పెంచినట్లు తెలిపింది. కొత్త జీవో ద్వారా క్రీడాకారులకు ఈ మేరకు క్యాష్ అవార్డు ఇస్తామని కర్ణాటక యువజన, క్రీడా శాఖ మంగళవారం ప్రకటన విడుదల చేసింది.పాల్గొన్నది వీరేకాగా కర్ణాటక నుంచి ఆసియా క్రీడలు-2026 టోర్నీలో యశ్ పలాక్ష, సుప్రియ సోందిగర బసవరాజు, ఉన్నతి అయ్యప్ప, ఎంఆర్ పూవమ్మ, స్నేహా ఎస్ఎస్, ఆయుశ్ శెట్టి, శ్రేయాంక ఆర్.పాటిల్, కిరణ్ రంగమణి, ఫౌవాద్ మీర్జా, అదితి అశోక్, ప్రణవి ఎస్. ఆరస్, మోహిత్ హెచ్ఎస్, తిలోత్తమ సేన్, ఆకాశ్ మణి, శ్రీహరి నటరాజ్ తదితరులు ఉన్నారు.ఆమెకు ఏకంగా రూ. 1.75 కోట్లు!వీరిలో ఎనిమిది మంది పతకాలను ముద్దాడారు. భారత మహిళల క్రికెట్ జట్టు తరఫున శ్రేయాంక స్వర్ణం గెలవడం ద్వారా రూ. కోటి నజరానా అందుకోనుంది. ఇక అథ్లెట్, ఎంఆర్ పూవమ్మ మహిళల రిలే పరుగులో స్వర్ణానికి కోటి, మిక్స్డ్ టీమ్‌లో రజతం గెలిచి రూ. 75 లక్షలు అందుకోనుంది. వీరికి కూడా భారీ నజరానాలుతిలోత్తమ సేన్ 50 మీటర్ల రైఫిల్ టీమ్ ఈవెంట్లో సిల్వర్ గెలిచినందుకు గానూ రూ. 75 లక్షలు. బ్యాడ్మింటన్‌లో కాంస్యం గెలిచినందుకు ఆయుశ్ శెట్టి రూ. 50 లక్షలు, అథ్లెటిక్స్‌లో స్నేహ రజతానికి రూజ 50 లక్షలు అందుకోనున్నారు.మరోవైపు.. గోల్ఫ్ టీమ్ మహిళల ఈవెంట్లో అదితి అశోక్, ప్రణవి రజతం గెలిచి రూ. 75 లక్షలు అందుకోనున్నారు. ఇక వ్యక్తిగత విభాగంలో స్వర్ణం గెలిచినందుకు ప్రణవికి అదనంగా రూ. కోటి నజరానా అందనుంది. పసిడి గెలిచిన పురుషుల హాకీ జట్టులో భాగమైన మోహిత్‌కు రూ. కోటి రానున్నాయి.అయితే దీనితో పాటు క్రీడల్లో పాల్గొన్నందుకు గానూ ప్రోత్సాహకంగా అదనంగా తలా ఐదు లక్షలు కూడా లభిస్తాయి.చదవండి: నాశనం చేస్తున్నారు: గంభీర్, గిల్‌పై మాజీ క్రికెటర్ ఫైర్ -
‘గోల్డ్ గెలిచినా పట్టించుకోలేదు.. రెండ్రోజుల తర్వాత సీఎం ఫోన్’
ఆసియా క్రీడలు-2026 టోర్నీలో అథ్లెటిక్స్‌లో భారత్‌కు మంగళవారం స్వర్ణం అందించింది మహిళల రిలే జట్టు. కిరణ్ మహల్, ఎంఆర్ పూవమ్మ, ప్రాచీ ఛౌదరి, విత్య రామ్రాజ్ 4*400 మీటర్ల రిలే పరుగును 3 నిమిషాల 29.9 సెకన్లలో పూర్తి చేసి.. పసిడి పతకాన్ని ముద్దాడారు.మూడో లెగ్ ముగిసే సమయానికి భారత్ మూడో స్థానంలోనే ఉన్నా.. ఆఖరి లెగ్‌లో అద్భుతంగా పరిగెత్తి విత్య జట్టును అగ్రస్థానంలో నిలిపింది. ఏషియాడ్ అథ్లెటిక్స్ చరిత్రలో మహిళల 4*400 మీటర్ల రిలే పరుగులో భారత్‌కు ఇది ఏడో పసిడి పతకం.గోల్డ్ గెలిచినా పట్టించుకోలేదు.. ఈ నేపథ్యంలో కిరణ్, పూవమ్మ, ప్రాచీ, విత్యలపై ప్రశంసల వర్షం కురిసింది. అయితే, వీరిలో 36 ఏళ్ల పూవమ్మకు గోల్డ్ గెలిచినా సొంత రాష్ట్రం నుంచి కనీసం అభినందించే వారు లేక చేదు అనుభవం చవిచూడాల్సి వచ్చింది. సీఎన్ఎన్-న్యూస్18తో మాట్లాడుతూ.. పూవమ్మ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది.రెండ్రోజుల తర్వాత సీఎం ఫోన్‘‘బంగారు పతకం గెలిచిన రెండు రోజుల తర్వాత మా ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఉప ముఖ్యమంత్రి జి. పరమేశ్వర నాకు కాల్ చేసి.. మెడల్ సాధించినందుకు అభినందించారు. నన్ను ఎవరూ పట్టించుకోలేదని మీడియాలో వార్తలు వచ్చిన తర్వాతే వాళ్లు నాకు ఫోన్ చేశారు.అయితే, పతకాలు గెలిచిన అథ్లెట్లకు ఇచ్చే ప్రైజ్‌మనీని త్వరలోనే పెంచుతామని సీఎం నాతో చెప్పారు. నన్ను సత్కరిస్తామని కూడా అన్నారు’’ అని కర్ణాటకలోని దక్షిణ కన్నడ ప్రాంతానికి చెందిన పూవమ్మ తెలిపింది.చదవండి: త్వరలోనే టీమిండియా టీ20 వైస్ కెప్టెన్‌గా అతడు! View this post on Instagram A post shared by Indiantrackandfield (@indiantrackandfield) -
వీళ్లు మనకు తెలుసునా..!
గతవారం ఢిల్లీలో క్రీడా ఆవార్డుల కార్యక్రమం ముగిసింది. జాతీయ మీడియా నుంచి ప్రాంతీయ మీడియా వరకూ అంతా రాజీవ్ ఖేల్ రత్న సానియా మీర్జా ఫోటోను ప్రముఖంగా ప్రచురించాయి. ప్రొఫెషనల్ టెన్నిస్ లో సానియా సాధించిన విజయాలకు ఖేల్ రత్న ఖచ్చితంగా సముచితమైన గౌరవమే..అయితే సానియా తో పాటు మరో డజను మంది ఆటగాళ్లు గత ఏడాది కాలంగా తమ తమ రంగాల్లో చూపిన అత్యుత్తమ ప్రదర్శనకు అర్జున అవార్డులు గెలుచుకున్నారు. దురదృష్ట వశాత్తు వీరిని మీడియా పట్టించుకోలేదు. అవార్డుల వెనక రాజకీయాలు... క్రీడా బోర్డుల అతి చొరవ, అనేక వివాదాలు మాత్రమే మీడియా దృష్టిని ఆకర్షస్తాయి. ఆటలంటే.. క్రికెట్, చెస్, సానియా, సైనాలు మాత్రమే కాదు అని ఎంతో మంది తమ అద్వితీయ ఆటతీరుతో నిరూపిస్తున్నా.. కోట్లాది భారతీయుల గుర్తింపునకు మాత్రం నోచుకోవడం లేదు.. అలాంటి అన్ సంగ్ హీరోస్ దేశంలో చాలా మందే ఉన్నా.. కనీసం ఈ ఏడాది రాష్ట్ర పతి చేతులతో అవార్డులు పొందిన క్రీడాకారుల ఎంత మంది మనకు తెలుసు.. ? సందీప్ కుమార్: ఆర్చరీ పూనేకి చెందిన సందీప్ కుమార్ ఆసియా క్రీడల్లో పటిష్ట కొరియాని మట్టి కరిపించి ఈ విభాగంలో తొలి బంగారు పతకాన్ని భారత్ కు అందించాడు. పూనమ్మ: అథ్లెటిక్స్ ఆఫ్రికా, యూరప్, అమెరికాలు డామినేట్ చేసే ఈ విభాగంలో మన పూవమ్మ ప్రపంచ 42 రెండో ర్యాంక్ లో కొనసాగుతోంది. గత ఏడాది జరిగిన ఆసియా క్రీడల్లో 400మీటర్ల వ్యక్తిగత కాంస్య పతకంతో పాటు, బంగారు పతకం గెలుచుకున్న 4X400 మీటర్ల రిలే టీమ్ లో సభ్యురాలు. అంతే కాదు ఆసియా స్థాయిలో బోలెడు వ్యక్తిగ పతకాలు సాధించి.. అర్జున అవార్డుకు అర్హత పొందింది. దీపా కుమార్: జిమ్నాస్టిక్స్ జిమ్నాస్టిక్స్ లో దీపా కుమార్ చరిత్రే సృష్టించింది. గ్లాస్కో కామన్ వెల్త్ క్రీడల్లో కాంస్యం సాధించి.. ఈ విభాగంలో పోడియం ఫినిష్ ఇచ్చిన తొలి భారత మహిళగా రికార్డులకెక్కింది. ఆసియా క్రీడల్లో పతకం తృటిలో కోల్పోయినా.. దీపా ప్రదర్శన విమర్శకుల ప్రశంసలందుకుంది. శ్రీజేష్ : హాకీ మన జాతీయ క్రీడా హాకీలో అద్భుత ప్రదర్శనకు గానూ.. శ్రీజేష్ అర్జున అవార్డు అందుకున్నాడు. 2014 ఆసియా క్రీడల్లో బంగారు పతకం అందుకున్న భారత జట్టు గోల్ కీపర్ శ్రీజేష్. అంతే కాదు. ఈ క్రీడల్లో పాకిస్తాన్ మ్యాచ్ లో శ్రీజేష్ అద్వితీయ ప్రదర్శన ఆయనకు ఆర్జున అవార్డు తెచ్చిపెట్టింది. ఫైనల్లో పాకిస్థాన్ సంధించిన రెండు పెనాల్టీ స్ట్రోక్ లను శ్రీజేష్ అడ్డుకున్నాడు. ఇక 2014 ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో గోల్ కీపర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. సతీష్ కుమార్: వెయిట్ లిఫ్టింగ్ అనామకుడిగా కామన్ వెల్త్ క్రీడల్లో అడుగు పెట్టిన ఈ 23ఏల్ల తమిళనాడు క్రీడాకారుడు... 77 కేజీల వెయిట్ లిఫ్టింగ్ లో గేమ్స్ రికార్డు బద్దలు కొట్టడమే కాదు.. బంగారు పతకాన్ని సాధించాడు. స్వరణ్ సింగ్ : రోయింగ్ 2012 సమ్మర్ ఓలింపిక్స్ లో రోయింగ్ లో ఫైనల్ కు చేరిన స్వరణ్.... 2013 ఆసియా రోయింగ్ చాంఫియన్ షిప్ లో బంగారు పతకం సాధించాడు. ఇక 2014 ఆసియా క్రీడల్లో తీవ్ర వెన్ను నొప్పితో బాధపడుతూ కూడా కాంస్య పతకాన్ని సాధించాడు. ఇక అందరికంటే స్పెషల్ క్రీడాకారుడిని వరించి అర్జున అవార్డు మరింత వన్నెలద్దుకుంది. అతని పేరు శరత్ గైక్వాడ్. వివిద విభాగాల్లో అత్యధిక మెడల్స్ సాధించిన ప్రఖ్యాత క్రీడాకారిణి పీటీ ఉష రికార్డును బద్దలు కొట్టిన శరత్ బెంగుళూరు వాసి. 2014 ఆసియా క్రీడల్లో ప్యారా స్విమ్మింగ్ విభాగంలో 6 పతకాలు సాధించాడు. 2012లండన్ ఒలింపిక్స్ లో పాల్గొన్న శరత్.. భారత్ తరఫున పారాలంపిక్స్ కు వెళ్లిన తొలి భారతీయ క్రీడాకారుడు కావడం గమనార్హం. -
పూవమ్మ, లిక్సీలకు రజతాలు
ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ వుహాన్: ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో గురువారం రెండో రోజు భారత్‌కు రెండు రజతాలు, రెండు కాంస్యాలు లభించాయి. మహిళల 400మీ. ఫైనల్లో ఎంఆర్ పూవమ్మ, హెప్టాథ్లాన్‌లో లిక్సీ జోసెఫ్ రజతాలు సాధించారు. 2013 ఈవెంట్లోనూ రజతం సాధించిన పూవమ్మ 53.07సె. టైమింగ్‌తో రెండో స్థానంలో నిలిచింది. 800మీ. రేసులో 2:13.44 సె.లలో గమ్యం చేరిన జోసెఫ్ 5,554 పాయింట్లతో రజతాన్ని ఖాయం చేసుకుంది. సహచరురాలు పూర్ణిమ హేమ్బ్రామ్ 5,511 పాయింట్లతో కాంస్యం పొందింది. ఇక పురుషుల 5వేల మీ. రేసులో 13:36.62సె.తో వ్యక్తిగత అత్యుత్తమ సమయాన్ని నమోదు చేసి జి.లక్ష్మణన్ కాంస్యం పొందాడు. మహిళల స్ప్రింట్ రిలేలో దుతీ చంద్, శ్రబని నందా, పద్మిణి, సిని సహదేవన్ బృందం నాలుగో స్థానంలో నిలిచి పతకాన్ని కోల్పోయింది. పురుషుల 4ఁ100మీ. రిలే జట్టు ఆరో స్థానం పొందింది. ఆసియా స్కూల్ చెస్‌లో రాజా రిత్విక్‌కు రజతం సాక్షి, హైదరాబాద్: ఆసియా స్కూల్ చెస్ చాంపియన్‌షిప్‌లో నగరానికి చెందిన ఆర్. రాజా రిత్విక్ రజతంతో మెరిశాడు. సింగపూర్‌లో జరుగుతున్న ఈ పోటీల అండర్-11 బ్లిట్జ్ విభాగంలో రిత్విక్ రెండో స్థానంలో నిలిచాడు. 7 రౌండ్లకుగాను రిత్విక్ మొత్తం 5.5 పాయింట్లు సాధించాడు. మంగోలియా ఆటగాడు టెంగిస్ ఓచిర్తో జరిగిన చివరి రౌండ్ గేమ్ ‘డ్రా’గా ముగియడంతో రిత్విక్‌కు రజతం ఖరారైంది. ప్రస్తుతం 1743 ఎలో రేటింగ్‌తో రిత్విక్ ‘క్యాండిడేట్ మాస్టర్’గా ఉన్నాడు. 100కు పైగా క్రీడాకారులు పాల్గొంటున్న ఈ టోర్నీ క్లాసిక్ విభాగంలో కూడా రాజా పోటీ పడుతున్నాడు. ఆసియా స్థాయిలో రజతం గెలుచుకున్న రిత్విక్‌ను చెస్ సంఘం, ఆర్చిడ్స్ స్కూల్ యాజమాన్యంతో పాటు ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్, తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకరరావు తదితరులు అభినందించారు.


