రోజుకు 18 గంటలు పని.. సీఎం బిజీ బిజీ: లక్ష్మి | Former Minister Lakshmi Hebbalkar Comments On Dk | Sakshi
Sakshi News home page

రోజుకు 18 గంటలు పని.. సీఎం బిజీ బిజీ: లక్ష్మి హెబ్బాళ్కర్

Oct 7 2026 8:08 AM | Updated on Oct 7 2026 8:08 AM

Former Minister Lakshmi Hebbalkar Comments On Dk

బెంగళూరు: సీఎం డీకే శివకుమార్‌ రోజులో 18 గంటల పాటు పని చేస్తూ ఫోన్‌లో కూడా మాట్లాడలేక పోతున్నట్లు మాజీ మంత్రి లక్ష్మి హెబ్బాళ్కర్‌ అన్నారు. ఆమె బెళగావిలో విలేకరులతో మాట్లాడుతూ గృహలక్ష్మి పథకం డబ్బులు ఖాతాల్లో వేయడం ఆలస్యం అవుతోందని ప్రస్తావించగా, తాను దీనిపై సీఎంతో మాట్లాడడానికి యత్నించగా సీఎం దొరకటం లేదన్నారు. ఆర్థిక శాఖ కార్యదర్శికి కాల్‌ చేసి త్వరగా నిధులు విడుదల చేయాలని కోరినట్లు ఆమె చెప్పారు. 

స్వామీజీలను కించపరచలేదు: సీఎం 
శివాజీనగర: రాష్ట్రంలో మఠాలు, స్వామీజీలు, పంచపీఠాల స్వామీజీల పట్ల అపారమైన గౌరవాన్ని కలిగి ఉన్నాను,  స్వామీజీలను అగౌరవంగా మాట్లాడలేదు అని ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్‌ చెప్పారు. మంగళవారం విధానసౌధలో మాట్లాడుతూ, ఇటీవల జరిగిన వీరశైవ స్వామీజీల కార్యక్రమంలో నేను ఏ స్వామీజీని అగౌరవపరచలేదు. ప్రజలతో పాటు మమ్మల్ని రక్షించి, సేవించండి, మేము కూడా మీకు సహాయం చేస్తామని చెప్పాను అని పేర్కొన్నారు. నేను దైవభక్తున్ని, నా మతంపై నాకు విశ్వాసం ఉంది. మానవత్వం వరి్ధల్లాలి, మతం ద్వారా ప్రపంచానికి శాంతి చేకూరాలనే కోరుకుంటానని తెలిపారు. కొంతమంది దీనిని వక్రీకరించి తమకు నచ్చినట్లుగా మాట్లాడుతారన్నారు. డీకే శివకుమార్‌ అధికార దాహానికి బానిస అయ్యారని అంటున్నారని వాపోయారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement