ఐశ్వర్యరాయ్‌ ప్రియుడితో చాటింగ్‌ చేసేది: తేజ్‌ | Tej Pratap Yadav Opens Up About Marital Disputes With Ex-Wife Aishwarya Rai, Makes Allegations On Reality Show | Sakshi
Sakshi News home page

ఐశ్వర్యరాయ్‌ ప్రియుడితో చాటింగ్‌ చేసేది: తేజ్‌

Oct 10 2026 9:49 AM | Updated on Oct 10 2026 10:54 AM

Tej Pratap Yadav talks about marriage

పట్నా: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తనయుడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ తన మాజీ భార్య ఐశ్వర్య రాయ్‌తో వివాహం, కొనసాగుతున్న విడాకుల వ్యవహారంపై స్పందించారు. ‘రైజ్‌ అండ్‌ ఫాల్‌’ రియాలిటీ షోలో పాల్గొన్న ఆయన.. తమ మధ్య జరిగిన గొడవలు, విభేదాల గురించి వెల్లడించారు. ఐశ్వర్య తన మాజీ ప్రియుడితో చాటింగ్‌ చేసేవారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఇంటికి వెళ్లాలనిపించేది కాదు
పెళ్లయిన కొత్తలో దాదాపు మూడు నెలలపాటు తమ మధ్య తరచూ గొడవలు జరిగేవని తేజ్‌ ప్రతాప్‌ తెలిపారు. ఇద్దరి స్వభావాలు వేర్వేరుగా ఉండటంతో సమస్యలు ఎదురయ్యాయని, తమ వివాహం ఒత్తిడి మధ్య జరిగిందని చెప్పారు. ఆ సమయంలో తాను బిహార్‌ ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నానని గుర్తుచేసుకున్నారు. భార్యతో విభేదాల కారణంగా ఇంటికి వెళ్లాలనిపించేది కాదని, కొన్నిసార్లు స్నేహితుల ఇళ్లలో ఉండేవాడినని తెలిపారు. ఉదయం ప్రార్థనలు చేయడాన్ని ఐశ్వర్య ఇష్టపడేవారు కాదని ఆరోపించారు.

మాజీ ప్రియుడితో చాటింగ్‌ చేశారంటూ ఆరోపణ
ఒకరోజు శాసనసభ నుంచి ఇంటికి తిరిగొచ్చి గదిలోకి వెళ్లినప్పుడు ఐశ్వర్య ఓ యువకుడితో చాటింగ్‌ చేస్తూ కనిపించారని తేజ్‌ ప్రతాప్‌ చెప్పారు. ఆ యువకుడు ఆమె మాజీ ప్రియుడని, సందేశాల్లో హృదయాకారపు గుర్తులు ఉన్నాయని ఆరోపించారు. తమ మధ్య గొడవలు జరిగినప్పుడల్లా వీడియోలు రికార్డు చేసేవాడినని, వాటిని కోర్టులో ఆధారాలుగా సమర్పించినట్లు తెలిపారు.

ఇప్పటికీ వెంటాడుతున్న జ్ఞాపకాలు
వివాహ సమయంలో ఎదురైన గొడవలు ఇప్పటికీ తనను మానసికంగా ఇబ్బంది పెడుతున్నాయని తేజ్‌ ప్రతాప్‌ వెల్లడించారు. ఎవరైనా గొంతు పెంచి మాట్లాడినప్పుడు గతంలోని సంఘటనలు గుర్తుకొస్తాయని చెప్పారు. తేజ్‌ ప్రతాప్‌, ఐశ్వర్య రాయ్‌ల వివాహం 2018 మేలో జరిగింది. పెళ్లయిన కొద్ది నెలలకే వారి మధ్య విభేదాలు తలెత్తడంతో తేజ్‌ ప్రతాప్‌ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసు న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉంది.

ఇదీ చదవండి: జైలుకైనా సిద్ధం.. జ్ఞానేశ్ రాజీనామా చేసే వరకు పోరాటం: అభిజీత్ దీప్కే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement