పాకిస్తాన్ టెస్టు జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ ఆటతీరులో మార్పు రావడం లేదు. శ్రీలంకతో జరగబోయే టెస్ట్ సిరీస్‌కు ముందు తిరిగి ఫామ్‌లోకి రావాలనే లక్ష్యంతో బాబర్ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్ టోర్నీ 'క్వాయిడ్-ఎ-అజమ్ ట్రోఫీ'లో ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే అక్కడ కూడా అతడు నిలకడలేమితో సతమతమవుతున్నాడు. ఈ టోర్నీలో లాహోర్ వైట్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న బాబర్.. ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు.
తాజాగా ఫటాతో జరిగిన మ్యాచ్‌లోనూ బాబర్ అదే పేలవ ప్రదర్శనను కొనసాగించాడు. ఈ మ్యాచ్‌లోని రెండు ఇన్నింగ్స్‌లలో వరుసగా 28, 42 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో 42 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అనవసర షాట్ ఆడి ఔటైన బాబర్.. తీవ్ర అసహనానికి గురై తన బ్యాట్‌ను గ్రౌండ్‌పై గట్టిగా కొట్టాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు, "అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు బ్రో.. కావాలంటే రిటైర్ అయిపోవచ్చు కదా!" అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.
మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఫటా జట్టు ఫవాద్ అర్షద్ (115) సెంచరీతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 362 పరుగులు సాధించింది. అనంతరం బరిలోకి దిగిన లాహోర్ వైట్స్ 234 పరుగులకే ఆలౌట్ అయింది. లాహోర్ జట్టులో అలీ జర్యాబ్ (51) మాత్రమే పర్వాలేదనిపించాడు.
నవంబర్ 9 నుంచి రావల్పిండి వేదికగా శ్రీలంకతో తొలి టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. బాబర్ ఆజమ్ ఇలా పేలవ ఫామ్‌ను కొనసాగిస్తుండటం పాకిస్తాన్ టీమ్ మేనేజ్‌మెంట్‌ను తీవ్రంగా కలవరపెడుతోంది.
Babar Azam keeps getting dismissed in the same manner. Not a good sign! 😬 https://t.co/dLXh35ST7S
— Sheri. (@CallMeSheri1_) November 6, 2026


