source: X
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం వన్డే క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. ఒక దేశంలో అత్యంత వేగంగా (పాక్‌లో, 37 ఇన్నింగ్స్‌లు) 2000 వన్డే పరుగులు పూర్తి చేసిన బ్యాటర్ల జాబితాలో డికాక్‌తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో భారత యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ (భారత్‌లో, 33) అగ్రస్థానంలో ఉండగా.. వెస్టిండీస్ మాజీ బ్యాటర్ డెస్మండ్ హేన్స్ (వెస్టిండీస్‌లో, 36) రెండో స్థానంలో ఉన్నాడు.
పై రికార్డు సాధించే క్రమంలో బాబర్ మరో ఘనత కూడా సొంతం చేసుకున్నాడు. స్వదేశంలో అత్యంత వేగంగా (37 ఇన్నింగ్స్‌లు) 2000 పరుగులు పూర్తి చేసుకున్న బ్యాటర్‌గానూ నిలిచాడు. ఈ జాబితాలో ఇంజమామ్ (48), మొహమ్మద్ యూసఫ్ (49), షోయబ్ మాలిక్ (56) బాబర్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. స్వదేశంలో జరుగుతున్న ట్రై సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బాబర్ పై రెండు ఘనతలను సాధించాడు.
ఈ మ్యాచ్‌లో బాబర్ 52 బంతుల్లో 34 పరుగులు చేసి విల్ జాక్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో పాక్ ఇంగ్లండ్‌ను 87 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. అరాఫత్ మిన్హాస్ ఆల్‌రౌండర్ షోతో (59, 6-40) ఇరగదీసి పాక్‌కు అద్భుత విజయాన్నందించాడు. తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ (302-9) చేసిన పాక్, ఆతర్వాత బౌలింగ్‌లో మరింతగా చేలరేగి ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది (215 ఆలౌట్).
ఇదీ చదవండి: ఆల్‌రౌండర్ షోతో ఇరగదీసిన పాక్ ప్లేయర్


