source: X
స్వదేశంలో జరుగుతున్న వన్డే ట్రై సిరీస్‌లో పాకిస్తాన్ జట్టు చెలరేగిపోతుంది. టోర్నీలో వరుసగా రెండో విజయం నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో శ్రీలంకను చిత్తు చేసిన పాక్.. నిన్న ఇంగ్లండ్‌పై 87 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అరాఫత్ మిన్హాస్ ఆల్‌రౌండర్ షోతో ఇరగదీసి పాక్‌కు అద్భుత విజయాన్నందించాడు.
తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ (302-9) చేసిన పాక్, ఆతర్వాత బౌలింగ్‌లో మరింతగా చేలరేగి ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది (215 ఆలౌట్). మిన్హాస్ బ్యాట్‌తో మెరుపు అర్ద సెంచరీ (59), అనంతరం బంతితో (6-40) వీరలెవెల్లో విజృంభించాడు.
పాక్ ఇన్నింగ్స్‌లో మిన్హాస్‌తో పాటు హసన్ నవాజ్ (79) రాణించగా.. బాబర్ ఆజం (34), సాద్ బేగ్ (35), ఫహీమ్ అష్రఫ్ (39) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఫకర్ జమాన్ డకౌట్ కాగా.. సైమ్ అయూబ్ 8, తొలి మ్యాచ్ సెంచరీ హీరో సల్మాన్ అఘా 16, షాహీన్ అఫ్రిది (10 నాటౌట్), నసీం షా 1, హరీస్ రౌఫ్ (4 నాటౌట్) పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో సోనీ బేకర్ 3, అట్కిన్సన్ 2, జాక్స్, ఓవర్టన్, రషీద్, కర్రన్ తలో వికెట్ తీశారు.
భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌కు శుభారంభం లభించినప్పటికీ.. ఆతర్వాత మిన్హాస్ ధాటికి చేతులెత్తేసింది. ఓపెనర్లు టామ్ బాంటన్ 57, బెన్ డకెట్ 45, వన్‌డౌన్ బ్యాటర్ రూట్ 33 పరుగులు చేయగా, ఆతర్వాత వచ్చిన బ్యాటర్లు ఎవ్వరూ నిలదొక్కుకోలేకపోయారు. కెప్టెన్ బ్రూక్ 5, కర్రన్ 27, కాక్స్ 18, జాక్స్ 19, ఓవర్టన్ 1, అట్కిన్సన్ 7, రషీద్ డకౌటయ్యారు. పాక్ బౌలర్లలో మిన్హాస్‌తో పాటు హరీస్ రౌఫ్ (2-32), నసీం షా (1-46) వికెట్లు తీశారు. ఈ టోర్నీలో తదుపరి మ్యాచ్ (ఇంగ్లండ్ వర్సెస్ శ్రీలంక) అక్టోబర్ 22న జరుగనుంది.
ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా కెప్టెన్


