ఫాఫ్ డుప్లెసిస్‌కు రూ.2.88 కోట్లు.. మరి బాబర్‌ ఆజంకు ఎంతంటే? | Babar Azam sold to Desert Vipers as other ILT20 teams snub Pakistan cricketers | Sakshi
Sakshi News home page

ఫాఫ్ డుప్లెసిస్‌కు రూ.2.88 కోట్లు.. మరి బాబర్‌ ఆజంకు ఎంతంటే?

Oct 1 2026 7:51 PM | Updated on Oct 1 2026 8:00 PM

Babar Azam sold to Desert Vipers as other ILT20 teams snub Pakistan cricketers

PC: PAK cricket

పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ తొలిసారి యూఏఈ ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఐఎల్‌టీ20 5వ సీజన్‌లో అతడు డెసర్ట్ వైపర్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు.

దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ ఇండోర్స్‌లో గురువారం జరిగిన ఐఎల్‌టీ20 వేలంలో బాబర్‌ను 80,000 డాలర్ల (సుమారు రూ.76 లక్షలకు పైగా) బేస్ ప్రైస్‌కే డెసర్ట్ వైపర్స్ దక్కించుకుంది. అతడితో పాటు సహచర ఆటగాళ్లు నసీమ్ షా, ఫఖర్ జమాన్‌లను కూడా వైపర్స్ జట్టు వారి కనీస ధరలకే సొంతం చేసుకుంది.

కాగా ఈ ఐఎల్‌టీ20 లీగ్‌లోని మెజారిటీ జట్లు ఐపీఎల్ ఫ్రాంచైజీల యాజమాన్యాల ఆధీనంలోనే ఉన్నాయి. డెసర్ట్ వైపర్స్ మినహా ఏ ఫ్రాంచైజీ కూడా పాక్ ప్లేయర్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు.

మరోవైపు ఈ వేలంలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్‌ను దక్కించుకోవడానికి ఫ్రాంచైజీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. చివరికి దుబాయ్ క్యాపిటల్స్ అతడిని 3,00,000 డాలర్ల (సుమారు రూ. 2.88 కోట్లు) భారీ ధరకు సొంతం చేసుకుంది.

అలాగే అఫ్గానిస్తాన్ స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ రెహ్మానుల్లా గుర్బాజ్‌‌కు కూడా కళ్లు చెదిరే ధర దక్కింది. గల్ఫ్ జెయింట్స్ తమ 'రైట్-టు-మ్యాచ్' ఆప్షన్‌ను ఉపయోగించి గుర్బాజ్‌ను తిరిగి సొంతం చేసుకుంది. ఈ ఐఎల్‌టీ20 5వ సీజన్ నవంబర్ 22 నుంచి డిసెంబర్ 20 వరకు జరగనుంది.
చదవండి: IND vs WI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌.. టీమిండియాలో​కి విధ్వంసకర వీరుడు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement