టీమిండియాకు భారీ షాక్‌.. ఉన్నపళంగా అతడికి పిలుపు | BCCI removes Anshul Kamboj from India A XI midway through Australia A match | Sakshi
Sakshi News home page

IND vs WI: టీమిండియాకు భారీ షాక్‌.. ఉన్నపళంగా అతడికి పిలుపు

Oct 1 2026 5:20 PM | Updated on Oct 1 2026 6:21 PM

BCCI removes Anshul Kamboj from India A XI midway through Australia A match

PC: BCCI/X

గువాహటి వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో ఘన విజయం సాధించిన భారత జట్టుకు 24 గంటలు తిరగకముందే భారీ షాక్ తగిలింది. శనివారం చండీగఢ్‌లో జరగనున్న మూడో వన్డేకు స్టార్ ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ గాయం కారణంగా దూరమయ్యాడు.

గువాహటి వన్డేలో ప్రసిద్ధ్ కృష్ణ తొడ కండరాల గాయం (హ్యామ్‌స్ట్రింగ్) బారిన పడ్డాడు. దీంతో కేవలం ఐదు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి మైదానాన్ని వీడాడు. అనంతరం అతడికి స్కానింగ్ నిర్వహించగా, గాయం తీవ్రమైనదిగా తేలినట్లు సమాచారం. 

దీంతో అతడు మూడో వన్డే కోసం భారత జట్టుతో ప్రయాణించకుండా నేరుగా బెంగళూరులోని 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'లో రిపోర్ట్ చేయనున్నాడు. అక్కడ అతడు తన రీహాబ్ ప్రక్రియను ప్రారంభించనున్నాడు. ఈ గాయం కారణంగా అతడు రాబోయే న్యూజిలాండ్ పర్యటనకు కూడా దూరమయ్యే అవకాశముంది.

ఇక ప్రసిద్ధ్ స్థానంలో చివరి వన్డే కోసం అన్షుల్ కాంబోజ్ను సెలక్టర్లు జట్టులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కాంబోజ్ ప్రస్తుతం ఆస్ట్రేలియా-ఎతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భారత్-ఎ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే భారత సీనియర్ జట్టుతో కలిసేందుకు కాంబోజ్ ఉన్నపళంగా ఇండియా-ఎ జట్టు నుంచి వైదొలిగినట్లు 'స్పోర్ట్‌స్టార్' తన కథనంలో పేర్కొంది.
చదవండి: ENG vs PAK: ఇంగ్లండ్‌ జట్టు ప్రకటన.. 8 ఏళ్ల తర్వాత అతడికి పిలుపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement