తిరువనంతపురం వేదికగా తొలి వన్డేలో భారత్-వెస్టిండీస్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత్ తరపున ముంబై ఇండియన్స్ ఆటగాడు నమన్ ధీర్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.
అదేవిధంగా ఇంగ్లండ్ టూర్‌కు దూరంగా ఉన్న ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, నితీశ్‌కుమార్ రెడ్డి తిరిగి తుది జట్టులోకి వచ్చారు. ఓవరాల్‌గా ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో భారత్ బరిలోకి దిగింది. మరోవైపు విండీస్ సీనియర్ ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్ పునరాగమనం చేశాడు. జస్టిన్ గ్రీవ్స్‌తో కలిసి అతడు ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు.
తుది జట్లు
వెస్టిండీస్ : జాన్ కాంప్‌బెల్, జస్టిన్ గ్రీవ్స్, కీసీ కార్తీ, షాయ్ హోప్(కెప్టెన్), అమీర్ జాంగూ, జ్యువెల్ ఆండ్రూ, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డే, గుడాకేష్ మోటీ, అల్జారీ జోసెఫ్, జేడెన్ సీల్స్
భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నమన్ ధీర్, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, గుర్నూర్ బ్రార్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ


