విండీస్‌తో తొలి వన్డే.. విధ్వంసకర బ్యాటర్‌ అరంగేట్రం | IND VS WI 1st ODI: naman dhir makes his international debut | Sakshi
Sakshi News home page

విండీస్‌తో తొలి వన్డే.. విధ్వంసకర బ్యాటర్‌ అరంగేట్రం

Sep 27 2026 1:52 PM | Updated on Sep 27 2026 2:02 PM

IND VS WI 1st ODI: naman dhir makes his international debut

source: BCCI X

తిరువనంతపురం వేదికగా వెస్టిండీస్‌తో ఇవాళ జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా తరఫున కొత్త ఆటగాడు అరంగేట్రం చేశాడు. పంజాబ్‌కు చెందిన 26 ఏళ్ల విధ్వంసకర బ్యాటర్‌ నమన్‌ ధిర్‌ ఈ మ్యాచ్‌తో తన అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించనున్నాడు. 

ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకోగా.. నమన్‌ ధిర్‌కు తుది జట్టులో చోటు దక్కింది. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ చేతుల మీదుగా నమన్‌ ధిర్‌ భారత క్యాప్‌ను అందుకున్నాడు.

షేర్‌-ఎ-పంజాబ్‌ లీగ్‌లో అదరగొట్టి..
ఇటీవల జరిగిన షేర్‌-ఎ-పంజాబ్‌ టీ20 లీగ్‌లో నమన్‌ ధిర్‌ సంచలన ప్రదర్శనలు చేశాడు. అమృత్‌సర్‌ సూర్మాస్‌ తరఫున 10 మ్యాచ్‌ల్లో 72.78 సగటు, 217.61 స్ట్రైక్‌రేట్‌తో 655 పరుగులు చేశాడు. 

సెప్టెంబర్‌ 8న మొహాలీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 64 బంతుల్లోనే 173 పరుగులు బాదాడు. ఈ అద్భుత ప్రదర్శనతోనే అతడు వెస్టిండీస్‌ వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు.

లిస్ట్‌-ఏ రికార్డు
భారత్‌ తరఫున అరంగేట్రం చేసే సమయానికి నమన్‌ 14 లిస్ట్‌-ఏ మ్యాచ్‌లు ఆడాడు. 11 ఇన్నింగ్స్‌ల్లో 351 పరుగులు చేశాడు. అతడి అత్యుత్తమ స్కోరు 97 పరుగులు. బౌలింగ్‌లోనూ ఏడు వికెట్లు పడగొట్టాడు. నమన్‌కు పంజాబ్‌, ఇండియా-ఏ, ముంబై ఇండియన్స్‌ తరఫున 20 ఫస్ట్‌క్లాస్‌, 61 టీ20 మ్యాచ్‌లు ఆడిన అనుభవం కూడా ఉంది.

ఐపీఎల్‌లో నమన్‌
నమన్‌ ధిర్‌ 2024 సీజన్‌ నుంచి ముంబై ఇండియన్స్‌తో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు  37 మ్యాచ్‌లు ఆడి 710 పరుగులు చేశాడు. 2026 సీజన్‌లో అతడు 14 మ్యాచ్‌ల్లో బరిలోకి దిగి 318 పరుగులు సాధించాడు.

తొలి వన్డేకు తుది జట్లు
వెస్టిండీస్ : జాన్ కాంప్‌బెల్, జస్టిన్ గ్రీవ్స్, కీసీ కార్తీ, షాయ్ హోప్(కెప్టెన్‌), అమీర్ జాంగూ, జ్యువెల్ ఆండ్రూ, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డే, గుడాకేష్ మోటీ, అల్జారీ జోసెఫ్, జేడెన్ సీల్స్

భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్‌), నమన్ ధిర్, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, గుర్నూర్ బ్రార్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ

ఇదీ చదవండి: IND vs WI: మ‌రి కాసేపట్లో మ్యాచ్‌.. అంత‌లోనే విండీస్‌కు భారీ షాక్‌


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement