IND vs WI: మ‌రి కాసేపట్లో మ్యాచ్‌.. అంత‌లోనే విండీస్‌కు భారీ షాక్‌ | Sherfane Rutherford ruled out of 1st ODI against India | Sakshi
Sakshi News home page

IND vs WI: మ‌రి కాసేపట్లో మ్యాచ్‌.. అంత‌లోనే విండీస్‌కు భారీ షాక్‌

Sep 27 2026 12:31 PM | Updated on Sep 27 2026 1:17 PM

Sherfane Rutherford ruled out of 1st ODI against India

తిరువనంత‌పురం వేదిక‌గా మ‌రి కాసేపట్లో భార‌త్‌-వెస్టిండీస్ మ‌ధ్య తొలి  వన్డే ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ప‌ర్య‌ట‌క విండీస్ జ‌ట్టుకు ఊహించ‌ని షాక్ త‌గిలింది. విధ్వంస‌క‌ర బ్యాట‌ర్ షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ వ్యక్తిగత కారణాల వల్ల మొద‌టి వ‌న్డేకు దూర‌మ‌య్యాడు. 

ఈ విష‌యాన్ని వెస్టిండీస్ క్రికెట్ బోర్డుతో పాటు కెప్టెన్ షాయ్ హోప్ కూడా ధ్రువీక‌రించాడు. ఎడ‌మచేతి వాటం బ్యాట‌ర్ అయిన రూథ‌ర్‌ఫోర్డ్ ఇంకా గ‌యానాలోనే ఉన్నాడు. అత‌డు సెప్టెంబ‌ర్ 30 గౌహ‌తి వేదిక‌గా జ‌ర‌గ‌నున్న రెండో వ‌న్డేకు ముందు జ‌ట్టుతో క‌ల‌వ‌నున్న‌ట్లు విండీస్ క్రికెట్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. 

రూథ‌ర్‌ఫోర్డ్ స్ధానంలో అమీర్ జంగూకు తుది జ‌ట్టులో చోటు ద‌క్కే అవ‌కాశ‌ముంది. మ‌రోవైపు గాయం నుంచి కోలుకున్న ఓపెన‌ర్ జాన్ క్యాంప్‌బెల్ పున‌రాగ‌మ‌నం చేసేందుకు సిద్ద‌మ‌య్యాడు. క్యాంప్‌బెల్ యువ బ్యాట‌ర్ జస్టిన్ గ్రీవ్స్‌తో క‌లిసి విండీస్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్న‌ట్లు తెలుస్తోంది. అదేవిధంగా నెట్స్‌లో గాయ‌ప‌డిన టీమిండియా కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్ కూడా పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. దీంతో తిరువ‌నంత‌పురం వ‌న్డేలో అత‌డే జ‌ట్టును న‌డిపించ‌నున్నాడు.

తుది జట్లు(అంచనా)
విండీస్‌: జాన్ క్యాంప్‌బెల్, జస్టిన్ గ్రీవ్స్, కీసీ కార్టీ, షాయ్ హోప్ (కెప్టెన్ & వికెట్ కీపర్), అమీర్ జంగూ, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, గుడాకేష్ మోటీ, అల్జారీ జోసెఫ్, జేడెన్ సీల్స్

భారత్‌: శుభమన్ గిల్ (కెప్టెన్‌), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్‌ రాహుల్ (వికెట్ కీపర్‌), నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, గుర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్
చదవండి: బ్యాటర్ల విధ్వంసం.. భారత్‌ సంచలన విజయం; సిరీస్‌ కైవసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement