రేపు తొలి వ‌న్డే.. విండీస్‌కు అచ్చిరాని వేదిక‌; గ‌త రికార్డులు ఇలా! | WI-ODI Records-India-Wins-Losses-1st ODI-Venue-Nightmare-For-Them | Sakshi
Sakshi News home page

రేపు తొలి వ‌న్డే.. విండీస్‌కు అచ్చిరాని వేదిక‌; గ‌త రికార్డులు ఇలా!

Sep 26 2026 4:58 PM | Updated on Sep 26 2026 5:12 PM

WI-ODI Records-India-Wins-Losses-1st ODI-Venue-Nightmare-For-Them

Photo Credit: Twitter

తిరువ‌నంత‌పురం వేదిక‌గా రేపు భార‌త్‌, వెస్టిండీస్ మ‌ధ్య తొలి వ‌న్డే జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే ఇరుజ‌ట్లు త‌మ ప్రాక్టీస్‌ను ముమ్మ‌రం చేశాయి. టీమిండియా రెండుగా చీలిపోయి 50 ఓవ‌ర్ల ఇంట్రాస్వ్కాడ్ మ్యాచ్ కూడా ఆడేశాయి. ఈ మ్యాచ్‌లో కోహ్లి, రోహిత్‌, నితీశ్‌కుమార్ రెడ్డి, జ‌డేజా త‌మ బ్యాటింగ్‌తో ఆక‌ట్టుకున్నారు. 

అటు వెస్టిండీస్ కూడా టీమిండియాను వారి సొంత‌గ‌డ్డ‌పైనే ఓడించి నంబ‌ర్‌వ‌న్ ర్యాంకు నుంచి ప‌డ‌గొట్టేందుకు సిద్ధ‌మైన‌ట్లు పేర్కొంది. అంతేకాదు 24 ఏళ్ల త‌ర్వాత భార‌త్‌పై వ‌న్డే సిరీస్ గెలిచే అవ‌కాశం త‌మ‌కు ల‌భించింద‌ని, దీనిని స‌ద్వినియోగం చేసుకుంటామ‌ని విండీస్ హెడ్‌కోచ్ డారెన్ సామీ ప్ర‌గ‌ల్భాలు ప‌లికాడు. టీమిండియాను ఓడించి చూపిస్తామ‌ని స‌వాల్ చేయ‌డం గ‌మ‌నార్హం.

గ‌త రికార్డులు ఇలా..
ఈ విష‌యం ప‌క్క‌న‌బెడితే, అస‌లు టీమిండియా గ‌డ్డ‌పై వెస్టిండీస్ వ‌న్డే రికార్డు ఎలా ఉంది? విజ‌యాలెన్నీ? ఓట‌ములెన్నీ అనేది ఒక‌సారి ప‌రిశీలిద్దాం. 1983 నుంచి 2022 వ‌ర‌కు చూసుకుంటే భార‌త్‌లో వెస్టిండీస్ 61 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 28 విజ‌యాలు, 32 ఓట‌ములు చ‌విచూసింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది.

అత్య‌ధిక స్కోరెంతంటే?
ఇక భార‌త గ‌డ్డ‌పై వ‌న్డేల్లో వెస్టిండీస్ చేసిన అత్య‌ధిక స్కోరు 333 ప‌రుగులు. 1983 డిసెంబ‌ర్ 7న జంషెడ్‌పూర్ వేదికగా జ‌రిగిన వ‌న్డేలో ఈ స్కోరు సాధించింది. ఆ మ్యాచ్‌లో భార‌త్ 229 ప‌రుగులకే ప‌రిమితం కావ‌డంతో విండీస్ జ‌ట్టు 104 ప‌రుగుల తేడాతో విజయం సాధించింది. చివ‌ర‌గా 2014లో కొచ్చి వేదిక‌గా జ‌రిగిన వ‌న్డేలో భార‌త్‌పై విండీస్ 321 ప‌రుగులు చేసింది.

అత్య‌ల్ప స్కోరెంతంటే?
ఇక భార‌త గ‌డ్డ‌పై విండీస్ అత్య‌ల్ప స్కోరు 80గా ఉంది. 2006 చాంపియ‌న్స్ ట్రోఫీలో శ్రీలంక‌తో మ్యాచ్‌లో వెస్టిండీస్ 80 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఇక భార‌త్‌పై విండీస్ అత్య‌ల్ప స్కోరు 104గా ఉంది. 2018లో ఇదే తిరువ‌నంత‌పురం వేదిక‌గా జ‌రిగిన వ‌న్డేలో విండీస్ 104 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఆ మ్యాచ్‌లో భార‌త్ 211 బంతులు మిగిలి ఉండ‌గానే టార్గెట్‌ను ఛేదించి విజ‌యాన్ని అందుకుంది. తిరువనంతపురం వేదిక అంటేనే విండీస్‌కు హడల్‌ అని చెప్పొచ్చు.

చివ‌రిసారి క్లీన్‌స్వీప్‌..
2021-22లో వెస్టిండీస్ జ‌ట్టు భార‌త్‌లో ప‌ర్య‌టించింది. మూడు వ‌న్డే మ్యాచ్‌ల సిరీస్‌ను భార‌త్ 3-0తో విండీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. కోవిడ్ కార‌ణంగా మూడు మ్యాచ్‌లకు అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర‌మోదీ స్టేడియం వేదిక‌గా నిలిచింది. మ్యాచ్‌ల‌న్నీ క్లోజ్ డోర్స్‌లోనే (ప్రేక్ష‌కులు లేకుండా) జ‌రిగాయి. తొలి వ‌న్డేను ఆరు వికెట్ల తేడాతో నెగ్గిన టీమిండియా, రెండో వ‌న్డేను 44 ప‌రుగుల తేడాతో గెలిచింది. 

ఇక చివ‌రి వ‌న్డేలో 96 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. నాలుగేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ వ‌న్డే సిరీస్ ఆడేందుకు భార‌త గ‌డ్డ‌పై అడుగుపెట్టిన వెస్టిండీస్ ఈసారి ఎలాంటి ప్ర‌ద‌ర్శ‌న చేస్తుంద‌నేది చూడాలి. ఇక వెస్టిండీస్ భార‌త గ‌డ్డ‌పై చివ‌రిసారి 2002లో వ‌న్డే సిరీస్‌ను గెలుచుకుంది. అప్ప‌టినుంచి ఇప్ప‌టిదాకా వెస్టిండీస్ రిక్త హ‌స్తాల‌తోనే వెనుదిరిగింది.

ఇదీ చ‌ద‌వండి: ఇరాన్‌ను చిత్తు చేసిన భారత్‌.. ఆసియా గేమ్స్‌లో నాలుగో స్వ‌ర్ణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement