Photo Credit: Twitter
ఆసియా గేమ్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు సెమీఫైనల్లో అడుగుపెట్టింది. పూల్-ఎలో శనివారం జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ 2-0తో ఆతిథ్య జపాన్‌ను మట్టికరిపించింది. తద్వారా పూల్-ఎలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించిన భారత జట్టు 12 పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా సెమీస్‌కు చేరుకుంది. తొలుత ఇండోనేషియాను (13-1తో), శ్రీలంకను (16-1తో), దక్షిణ కొరియాను (8-2తో) చిత్తు చేసిన భారత్ తాజాగా జపాన్‌ను కూడా ఓడించి స్వర్ణం గెలుచుకునేందుకు రెండు అడుగుల దూరంలో నిలిచింది.
సెమీస్ చేరిన మహిళల జట్టు
మరోవైపు భారత మహిళల హాకీ జట్టు కూడా సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది. శుక్రవారం ఆతిథ్య జపాన్ జట్టుతో శుక్రవారం జరిగిన పూల్ ‘బి’ మ్యాచ్‌లో టీమిండియా 3–1 గోల్స్ తేడాతో గెలిచింది. 12 పాయింట్లతో అగ్రస్థానాన్ని ఖాయం చేసుకుంది. ఆదివారం జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో సింగపూర్‌తో భారత్ ఆడుతుంది.
𝗗𝗘𝗙𝗘𝗡𝗗𝗜𝗡𝗚 𝗖𝗛𝗔𝗠𝗣𝗜𝗢𝗡𝗦 𝗜𝗡𝗧𝗢 𝗧𝗛𝗘 𝗦𝗘𝗠𝗜𝗦! 🇮🇳🔥
The Indian Men’s Team continues its winning run at the Asian Games 2026, beating Japan 2-0 to make it four wins from four and book a place in the Semi-Finals! 🏑💪
The hunt for another Asian Games gold heads… pic.twitter.com/7tPrb7WIhv— Hockey India (@TheHockeyIndia) September 26, 2026
ఇదీ చదవండి: Asian Games 2026: బుల్లెట్ ట్రైన్‌లో టీమిండియా ప్రయాణం


