ఇరాన్‌ను చిత్తు చేసిన భారత్‌.. ఆసియా గేమ్స్‌లో నాలుగో స్వ‌ర్ణం | Asian Games 2026: Indian Men’s Kabaddi Team Beats Iran 40-34 to Win Gold Medal | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ను చిత్తు చేసిన భారత్‌.. ఆసియా గేమ్స్‌లో నాలుగో స్వ‌ర్ణం

Sep 26 2026 3:44 PM | Updated on Sep 26 2026 4:23 PM

India Mens Team Beat Iran With 40-34 Score-Clinch Gold Medal-Asian Games

Photo Credit: Twitter

ఆసియా గేమ్స్‌లో భార‌త్ ఖాతాలో మరో స్వ‌ర్ణం వ‌చ్చి చేరింది. ఇప్ప‌టికే మ‌హిళ‌ల క‌బ‌డ్డీ జ‌ట్టు స్వ‌ర్ణంతో మెర‌వ‌గా, తాజాగా డిఫెండింగ్ చాంపియ‌న్ భార‌త‌ పురుషుల క‌బ‌డ్డీ జ‌ట్టు కూడా ప‌సిడి ప‌త‌కం గెలుచుకుంది. శ‌నివారం జ‌రిగిన ఫైన‌ల్లో భార‌త్ 40-34 తేడాతో ఇరాన్‌ను చిత్తు చేసి స్వ‌ర్ణం ఒడిసిప‌ట్టింది. 

తొలి హాఫ్‌లో భార‌త్‌కు ఇరాన్ గ‌ట్టి పోటీనిచ్చింది. ఒక ద‌శ‌లో 18-17తో స‌మానంగా నిలిచాయి. అయితే రెండో సగంలో భార‌త రైడ‌ర్లు విజృంభించి వ‌రుస టాకిల్ పాయింట్లతో భార‌త్ ఆధిక్యాన్ని అంత‌కంతకూ పెంచుకుంటూ పోయారు. ఆట‌ చివ‌రి నిమిషాల్లో కాస్త హైడ్రామా నెల‌కొంది. చివ‌ర్లో ఇరాన్ మ‌రో 5 పాయింట్లు సాధించి ఆధిక్యాన్ని త‌గ్గించ‌గ‌లిగిందే కానీ భార‌త్ చేతిలో ఓట‌మి త‌ప్పించుకోలేక‌పోయింది. 

పురుషుల క‌బ‌డ్డీలో ఆసియా గేమ్స్‌లో భార‌త్ చాంపియ‌న్స్‌గా నిల‌వ‌డం ఇది వ‌రుస‌గా తొమ్మిదో సారి కావ‌డం విశేషం. 1990 నుంచి వ‌రుస‌గా 9 సార్లు భార‌త పురుషుల క‌బడ్డీ జ‌ట్టు స్వ‌ర్ణ ప‌త‌కాలు గెలుస్తూ వ‌స్తోంది. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు ఇది నాలుగో స్వర్ణం కాగా, ఇప్పటివరకు 4 స్వర్ణాలు, 11 రజతాలు, 13 కాంస్యాలు కలిపి మొత్తం 28 పతకాలు సాధించింది. 

పతకాల పట్టికలో భారత్‌ ప్రస్తుతం పదో  స్థానంలో కొనసాగుతోంది. అంతకముందు మహిళల కబడ్డీ జట్టు కూడా స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే. హోరాహోరీగా సాగిన ఫైనల్లో భారత్ 37-34 తేడాతో ఇరాన్‌ను చిత్తు చేసింది.

 

 

ఇదీ చదవండి: కబడ్డీ బాటలోనే హాకీ జట్లు.. డబుల్‌ స్వర్ణాలపై గురి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement