టేబుల్ టెన్నిస్‌లో కాంస్యం.. అథ్లెటిక్స్‌లో 9 పతకాలు ఖాయం! | Manush-Diya Chitale Win Bronze-Mixed Doubles Table Tennis Asian Games | Sakshi
Sakshi News home page

Asian Games: టేబుల్ టెన్నిస్‌లో కాంస్యం.. అథ్లెటిక్స్‌లో 9 పతకాలు ఖాయం!

Sep 25 2026 4:19 PM | Updated on Sep 25 2026 4:47 PM

Manush-Diya Chitale Win Bronze-Mixed Doubles Table Tennis Asian Games

Photo Credit: Twitter

ఆసియా గేమ్స్ 2026లో భార‌త్ ఖాతాలో 20వ ప‌త‌కం వ‌చ్చి చేరింది. టేబుల్ టెన్నిస్ మిక్స‌డ్‌ డ‌బుల్స్ విభాగంలో మానుష్ షా-దియా చితాలే జోడీ కాంస్య ప‌త‌కం గెలుచుకుంది. సెమీస్‌లో చైనాకు చెందిన స‌న్ ఇంగ్‌షా-వాంగ్ చుయిన్ చేతిలో 4-0 (8-11, 5-11, 8-11, 2-11) తేడాతో మానుష్-దియా జోడీ ఓట‌మి చ‌విచూసింది. 

సెమీఫైన‌ల్లో ప్ర‌త్య‌ర్థి చేతిలో వ‌రుస గేముల్లో ఓట‌మిపాలైన‌ప్ప‌టికీ, కాంస్యం ద‌క్కించుకుంది. దీంతో భార‌త్ ఇప్ప‌టివ‌ర‌కు 20 ప‌త‌కాలు సొంతం చేసుకోగా, ఇందులో రెండు స్వ‌ర్ణాలు, 8 ర‌జ‌తాలు, 10 కాంస్యాలున్నాయి. ప‌త‌కాల ప‌ట్టిక‌లో భార‌త్ 12వ స్థానంలో కొన‌సాగుతుంది. ఇక అథ్లెటిక్స్ విభాగంలో భార‌త ప్లేయ‌ర్లు దాదాపు 9 ప‌త‌కాలు ఖాయం చేసుకున్నారు. ఉద‌యం షూటింగ్ విభాగంలో ఒక స్వ‌ర్ణం, ర‌జ‌తం వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. 

10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్‌ ఫైనల్‌లో కమల్‌జీత్ - సురుచి సింగ్ జోడీ అగ్రస్థానంలో నిలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్స్‌ టీమ్‌ ఈవెంట్‌లో ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్‌ తోమర్‌, నీరజ్‌ కుమార్‌, రుద్రాంక్ష్‌ పాటిల్‌ త్రయం రజత పతకాన్ని సొంతం చేసుకుంది. 

ఇదీ చ‌ద‌వండి: 24 ఏళ్ల త‌ర్వాత‌ సౌతాఫ్రికా స్పిన్న‌ర్ అరుదైన ఫీట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement