చ‌రిత్ర సృష్టించిన జోస్ బట్లర్‌.. తొలి ఇంగ్లండ్ క్రికెటర్‌గా | Jos Buttler first England batter to pass 10,000 limited-overs runs | Sakshi
Sakshi News home page

ENG vs SL: చ‌రిత్ర సృష్టించిన జోస్ బట్లర్‌.. తొలి ఇంగ్లండ్ క్రికెటర్‌గా

Sep 25 2026 2:13 PM | Updated on Sep 25 2026 2:53 PM

Jos Buttler first England batter to pass 10,000 limited-overs runs

PC: England cricket

ఇంగ్లండ్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. గురువారం లీడ్స్ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలోనూ బట్లర్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 49 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 69 పరుగులు చేశాడు. ఈ క్రమంలో బట్లర్‌ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 

వన్డే, టీ20 క్రికెట్ మ్యాచ్‌లలో కలిపి పది వేల పరుగుల మైలు రాయిని అందుకున్న తొలి క్రికెటర్‌గా బట్లర్ నిలిచాడు. బట్లర్ ఇప్పటివరకు 204 వన్డే మ్యాచ్‌లలో 39.15 సగటు సగటుతో 5,678 పరుగులు చేశాడు. ఇందులో  11 సెంచరీలు, 30 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 

అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 162గా ఉంది. అదేవిధంగా అంతర్జాతీయ టీ20ల్లో  34.79 సగటుతో మొత్తం 4,384 పరుగులు చేశాడు. టీ20 క్రికెట్‌లో ఇంగ్లండ్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా బట్లర్ కొనసాగుతున్నాడు. మొత్తంగా ఈ రెండు ఫార్మాట్ల‌లో క‌లిపి అత‌డు 10,062 ప‌రుగులు చేశాడు. 

ఇక ఈ మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. శ్రీలంక చేతిలో 16 ప‌రుగుల తేడాతో ఇంగ్లండ్ ఓట‌మి చ‌విచూసింది. 322 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఇంగ్లండ్‌.. నిర్ణీత ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 305 ప‌రుగులు చేయ‌గ‌లిగింది. లంక బౌల‌ర్ల‌లో స్పిన్న‌ర్‌ దునిత్ వెల్లలాగే మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఈ విజ‌యంతో మూడు వ‌న్డేల సిరీస్‌ను శ్రీలంక 1-1తో స‌మం చేసింది. ఇరు జ‌ట్ల మ‌ధ్య సిరీస్ డిసైడ‌ర్ ఆదివారం జ‌ర‌గ‌నుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement