Photo Credit: SAI Twitter
ఆసియా గేమ్స్‌లో కచ్చితంగా పతకం సాధిస్తారనుకున్న భారత డబుల్స్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి నిరాశపరిచారు. జపాన్ వేదికగా జరుగుతున్న గేమ్స్‌లో డిఫెండింగ్ చాంపియన్లయిన సాత్విక్-చిరాగ్ జోడీ తొలి రౌండ్‌లోనే ఓటమిపాలయ్యి టోర్నీ నుంచి నిష్క్రమించింది. శుక్రవారం జరిగిన పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్ తొలి రౌండ్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన పక్కాపోన్ తీరాతరత్సాకుల్-పీరట్చాయ్ సుక్‌ఫున్ జోడీ 12-21, 21-19, 21-14 తేడాతో సాత్విక్-చిరాగ్ జోడీ ఓటమి చవిచూసింది.
గంటా 8 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి గేమ్‌ను సునాయాసంగా కైవసం చేసుకున్న సాత్విక్ జంట రెండో గేమ్‌ను ప్రత్యర్థికి కోల్పోయింది. అయితే కీలకమైన మూడో గేమ్‌లో పూర్తిగా ఒత్తిడికి లోనైన భారత ద్వయానికి ఓటమి తప్పలేదు. గత ఆసియా గేమ్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే.
టీమ్ విభాగంలో కాంస్యం గెలిచిన భారత్‌కు సాత్విక్-చిరాగ్ జోడీ డబుల్స్ విభాగంలో పక్కాగా పతకం తెస్తారని ఆశించగా, ఈ ఓటమి అభిమానులను షాక్‌కు గురి చేసిందని చెప్పొచ్చు. మిగిలిన మ్యాచ్‌ల విషయానికొస్తే.. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో తనిషా-ధ్రువ్ కపిల జంట తొలి రౌండ్‌లో విజయాన్నిసాధించింది.
ఈ జోడీ 21-8, 21-7తో మాల్దీవ్స్‌కు చెందిన నిబల్ అహ్మద్-అబినాథ్ జోడీపై 21 నిమిషాల్లోనే విజయం సాధించి ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. ఇక మహిళల సింగిల్స్‌లో ఉన్నతి హుడా రెండో రౌండ్‌కు చేరుకుంది. తొలి రౌండ్‌లో ఉన్నతి 21-9, 21-10తో నార్త్ కొరియాకు చెందిన మి సోంగ్ యును చిత్తు చేసింది.
ఇదీ చదవండి: SA vs AUS: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ఆల్‌రౌండర్


