కాకామిగహారా: వరుసగా నాలుగో విజయం సాధించిన భారత మహిళల హాకీ జట్టు సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఆతిథ్య జపాన్ జట్టుతో శుక్రవారం జరిగిన పూల్ ‘బి’ మ్యాచ్‌లో టీమిండియా 3–1 గోల్స్ తేడాతో గెలిచింది. 12 పాయింట్లతో అగ్రస్థానాన్ని ఖాయం చేసుకుంది. భారత్ తరఫున లాల్‌రెమ్‌సియామి (5వ ని.లో), ఇషిక (30వ ని.లో), నవ్‌నీత్ కౌర్ (36వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. జపాన్ జట్టుకు షిహో కొబయాకవా (46వ ని.లో) ఏకైక గోల్ అందించింది. ఆదివారం జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో సింగపూర్‌తో భారత్ ఆడుతుంది.


