source: X
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో ఇవాళ జరుగనున్న రెండో వన్డేకు ముందు సౌతాఫ్రికా జట్టులో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. స్టార్ బ్యాటర్ ర్యాన్ రికెల్టన్ వ్యక్తిగత కారణాలతో జట్టు నుంచి విడుదల కాగా.. అతడి స్థానంలో మరో స్టార్ బ్యాటర్ ఎయిడెన్ మార్క్రమ్ జట్టులోకి వచ్చాడు.
రికెల్టన్ తిరిగి మూడో వన్డే సమయానికి అందుబాటులో ఉంటాడని క్రికెట్ సౌతాఫ్రికా వెల్లడించింది. రెండో వన్డే ఇవాళ జోహనెస్‌బర్గ్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానుంది.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
రెండో వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
తుది జట్లు..
సౌతాఫ్రికా: ఎయిడెన్ మార్క్రమ్, క్వింటన్ డి కాక్(w), టెంబా బవుమా(c), మాథ్యూ బ్రీట్జ్కే, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, డువాన్ జాన్సెన్, బ్యోర్న్ ఫోర్టుయిన్, కేశవ్ మహారాజ్, లిజాద్ విలియమ్స్
ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్(c), ట్రావిస్ హెడ్, కూపర్ కానలీ, అలెక్స్ క్యారీ(w), మాట్ రెన్‌షా, కామెరాన్ గ్రీన్, జాక్ ఎడ్వర్డ్స్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్
కాగా, 3 మ్యాచ్‌ల వన్డే మరియు టెస్ట్ సిరీస్‌ల కోసం ఆస్ట్రేలియా జట్టు సౌతాఫ్రికాలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా తొలుత జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఆతిథ్య జట్టు 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. డర్బన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో సౌతాఫ్రికా 67 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఆ మ్యాచ్‌లో మాథ్యూ బ్రీట్జ్‌కే, కేశవ్ మహరాజ్ సౌతాఫ్రికాను గెలిపించాడు. బ్రీట్జ్‌కే సెంచరీ, మహారాజ్ 4 వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టారు.
టెస్ట్ సిరీస్‌కు ముందు గాయాల బెడద
వన్డే సిరీస్ ముగిసిన అనంతరం అక్టోబర్ 9 నుంచి సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్ మొదలుకానుంది. ఈ సిరీస్‌కు ముందు సౌతాఫ్రికాను గాయాల బెడద వేధిస్తుంది. పేసర్లు క్వేనా మఫాకా, కగిసో రబాడా, లుంగి ఎంగిడి ప్రస్తుతం హ్యామ్‌స్ట్రింగ్ గాయాలతో జట్టుకు దూరంగా ఉన్నారు. వీరు ముగ్గురు ఈ సిరీస్‌కు అందుబాటులో ఉండకపోతే సౌతాఫ్రికా విజయావకాశాలు భారీగా దెబ్బతినే ప్రమాదం ఉంది.
ఇదీ చదవండి: Virat Kohli: ఆ బాధ ఇప్పటికీ వెంటాడుతోంది..!


