'కోహ్లితో నాకేంటి?.. నా ఆటయితే పూర్తి కాలేదు' | Rohit Sharma Ambitions-Clear Says-My-Job-Not-Finish-Until-2027 ODI WC | Sakshi
Sakshi News home page

Rohit Sharma: 'కోహ్లితో నాకేంటి?.. నా ఆటయితే పూర్తి కాలేదు'

Sep 26 2026 9:26 PM | Updated on Sep 26 2026 9:43 PM

Rohit Sharma Ambitions-Clear Says-My-Job-Not-Finish-Until-2027 ODI WC

Photo Credit: BCCI Twitter

వెస్టిండీస్‌తో తొలి వ‌న్డే నేప‌థ్యంలో టీమిండియా స్టార్ బ్యాట‌ర్ రోహిత్ శ‌ర్మ త‌న భవిత‌వ్యంపై మ‌రోసారి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. 2027 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ త‌న చివ‌రి టోర్నీ అని కోహ్లి సంకేతాలు ఇచ్చిన నేప‌థ్యంలో హిట్‌మ్యాన్ రిటైర్మెంట్‌పై కూడా ఊహాగానాలు వ్య‌క్త‌మ‌య్యాయి. త‌న రిటైర్మెంట్‌పై వ‌స్తున్న ఊహాగానాల‌కు చెక్ పెడుతూ త‌న‌దైన శైలిలో బ‌దులిచ్చాడు. 

త‌న ఆట ఇంకా పూర్తి కాలేద‌ని, ఆడుతున్నంత కాలం త‌న ముందు ఏదో ఒక ల‌క్ష్యం ఉంటుంద‌ని రోహిత్ చెప్పుకొచ్చాడు. కోహ్లిది వ్య‌క్తిగ‌త నిర్ణ‌య‌మ‌ని, అత‌డితో త‌న‌కు ప‌ని లేద‌ని రోహిత్ పేర్కొన్న‌ట్లు తెలుస్తోంది. ఇంకా రోహిత్ మాట్లాడుతూ.. "నేను చేయాల్సిన పని పూర్తి అయిందనే ఆలోచన ఎప్పుడూ నా మనసులోకి రాదు. 

క్రికెట్ ఆడుతున్నంత కాలం నేను సాధించేందుకు ఏదో ఒకటి ఉంటుంది. ప్రస్తుతం నేను ప్రపంచ కప్ కోసం ఎదురుచూస్తున్నా. ప్రపంచ కప్‌ అయినా.. ఏదైనా ఐసీసీ టోర్నీ అయినా దానికి ప్రత్యేకమైన సవాలు ఉంటుంది. వేర్వేరు ప్రత్యర్థులతో, వివిధ మైదానాల్లో ఆడాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్టుగా మనం సిద్ధం కావాలి. భిన్నంగా ఆలోచించాలి. అదే ఈ టోర్నీల్లోని అసలైన సవాలు" అని రోహిత్‌ వివరించాడు.

2027 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ను భార‌త్‌కు అందించ‌డ‌మే ల‌క్ష్యంగా రోహిత్ కొన‌సాగుతున్నాడు. అందుకే టెస్టులు, టీ20ల‌కు వీడ్కోలు ప‌లికిన రోహిత్ అప్ప‌టినుంచి వ‌న్డే ఫార్మాట్‌లోనే కొన‌సాగుతూ వ‌స్తున్నాడు. 2023 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో త‌న కెప్టెన్సీలో సొంత‌గ‌డ్డ‌పై టీమిండియాను ఫైన‌ల్ చేర్చిన‌ప్పటికీ, తుదిమెట్టుపై బోల్తా కొట్టాడు. 

అయితే రెండు టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లు (2007, 2024) గెలిచిన టీమిండియా జ‌ట్టులో స‌భ్యుడైన రోహిత్‌.. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ గెల‌వాల‌న్న త‌న చిర‌కాల క‌ల‌ను నెర‌వేర్చుకునే పనిలో ఉన్నాడు. త‌న ఫామ్‌పై సందేహాలు వ‌చ్చిన ప్ర‌తీసారి రోహిత్ బ్యాట్‌తోనే స‌మాధానం చెప్పాడు. ఆఖ‌రిసారి ఇంగ్లండ్‌తో వ‌న్డే సిరీస్‌లో ఆడిన రోహిత్ శ‌ర్మ మూడో వ‌న్డేలో శ‌త‌కంతో మెరిశాడు. తాజాగా వెస్టిండీస్‌తో వ‌న్డే సిరీస్‌లో ఆ జ‌ట్టు బౌలర్ల భ‌ర‌తం ప‌ట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు.

ఇదీ చదవండి: గ‌మ్మత్తుగా ఒమ‌న్ క్రికెట్ టీం.. తొమ్మిది మందికి ఒకే ఇంటిపేరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement