PC: X
పాకిస్తాన్ టెస్టు కెప్టెన్ బాబర్ ఆజం మరోసారి నిరాశపరిచాడు. ఇంగ్లండ్ గడ్డ మీద ఈ కుడిచేతి వాటం బ్యాటర్ టెస్టుల్లో విఫలమైన సంగతి తెలిసిందే. గాయం వల్ల ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు దూరమైన బాబర్.. ఆ తర్వాతి మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా.. 8, 6 పరుగులు మాత్రమే చేశాడు.
ఏడేళ్ల తర్వాత రీఎంట్రీ
ఇక ఆఖరిదైన మూడో టెస్టులో తొలి ఇన్నింగగ్స్‌లో 7 పరుగులకే పరిమితమైన బాబర్ ఆజం.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 76 పరుగులు చేయగలిగాడు. ఈ క్రమంలో లోపాలు సరిచేసుకునేందుకు దాదాపు ఏడేళ్ల తర్వాత బాబర్ ఆజం దేశవాళీ క్రికెట్ బరిలో దిగాడు.
ప్రెసిడెంట్ ట్రోఫీ-2026లో భాగంగా ఆయిల్ అండ్ గ్యాస్ డెవలప్‌మెంట్ కంపెనీ తరఫున బాబర్ ఆజం.. ఖాన్ రీసెర్చ్ లాబోరేటరీస్ జట్టుతో మ్యాచ్ సందర్భంగా శనివారం మైదానంలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన బాబర్.. 20 బంతులు ఎదుర్కొని కేవలం 12 పరుగులు చేసి అవుటయ్యాడు.
పూర్తిగా విఫలం
అర్షద్ ఇక్బాల్ షార్ట్ పిచ్ బాల్‌గా సంధించిన బౌన్సర్ బౌన్సర్‌ను ఎదుర్కోవడంలో బాబర్ ఆజం పూర్తిగా విఫలమయ్యాడు. బంతిని తప్పుగా అంచనా వేసి షాట్ ఆడేందుకు ప్రయత్నించగా.. బ్యాట్ అంచుకు తాకి బాల్ గాల్లోకి లేవగా అబ్దుల్ ఫసీ సింపుల్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో బాబర్ ఆట కోసం ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానులకు తీవ్ర నిరాశే మిగిలింది.
కాగా బాబర్ ఆజం చివరగా 2022లో పాకిస్తాన్ తరఫున టెస్టుల్లో సెంచరీ చేశాడు. ఇదిలా ఉంటే.. తాజాగా బాబర్ మరోసారి విఫలమైన నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా మళ్లీ ట్రోల్స్ మొదలయ్యాయి. ‘‘జింబాబ్వే వంటి పసికూన మీద మాత్రమే బాబర్ ప్రతాపం చూపుతాడు.. సొంతగడ్డపై దేశవాళీ మ్యాచ్‌లో కూడా అతడు రాణించలేడు’’ అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు.
చదవండి: సచిన్‌తో అతడికి పోలికేంటి?: సెహ్వాగ్
Babar Azam is GONE! 🔥
7 years of waiting to play First Class cricket again… and he’s out for just 12 runs off 20 balls! 😭
Arshad Iqbal is ON FIRE!🔥 pic.twitter.com/hECRwFiBG7— Humais khan (@Humireacts) September 26, 2026


