source: X
పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో ఘోర పరాజయం తర్వాత బాబర్ ఆజం సేనపై ముప్పేట దాడి జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ జట్టు ప్రధాన కోచ్ మైక్ హెస్సన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ప్రస్తుతం భారత్ అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పుతోందని, ఆ స్థాయికి చేరుకోవడమే తమ ముందున్న లక్ష్యమని స్పష్టం చేశాడు.
గతంలో పాక్ పరిమిత ఓవర్ల జట్టుకే కోచ్‌గా వ్యవహరించిన హెస్సన్.. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో జట్టు పేలవ ప్రదర్శన తర్వాత టెస్టు జట్టు బాధ్యతలు కూడా చేపట్టాడు. ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో పాకిస్తాన్ జట్టును మెరుగుపర్చే బాధ్యత పీసీబీ అతనికి అప్పగించింది. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన హెస్సన్.. భారత జట్టు ప్రదర్శనను ప్రశంసించాడు.
టీమిండియానే బెంచ్‌మార్క్..!
వైట్‌బాల్ క్రికెట్‌లో భారత్ ఓ బెంచ్‌మార్క్‌గా నిలిచిందని హెస్సన్ పేర్కొన్నాడు. ఆ స్థాయిని అందుకోవడమే పాకిస్తాన్ ముందున్న సవాలని తెలిపాడు. ఇటీవలికాలంలో భారత్ చేతిలో పాకిస్తాన్ దాదాపు అన్ని సార్లు ఓడిందని, టీమిండియాను ఓడించాలన్నది పాక్ అభిమానుల ఆకాంక్ష అని హెస్సన్ చెప్పాడు.
టీ20 జట్టు మెరుగుపడుతుంది..!
పాక్ టీ20 జట్టు పూర్తిగా పతనమైందన్న విమర్శలను హెస్సన్ అంగీకరించలేదు. తాను బాధ్యతలు చేపట్టినప్పుడు ర్యాంకింగ్స్‌లో ఎనిమిదో స్థానంలో ఉన్న జట్టు ప్రస్తుతం ఐదో స్థానానికి చేరుకుందని గుర్తు చేశాడు. గత 15 నెలల్లో 30 రేటింగ్ పాయింట్లు మెరుగుపడ్డామని వివరించాడు. టెస్టు జట్టు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటోందని అంగీకరించాడు.
వన్డే ప్రపంచకప్‌పై గురి
2027లో దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు పాక్ జట్టును సిద్ధం చేయడంపై దృష్టి సారించినట్లు హెస్సన్ తెలిపాడు. భారత్‌లో జరిగిన 2023 ప్రపంచకప్‌లో పాక్ జట్టు ఘోరంగా విఫలమైన నేపథ్యంలో ఈసారి మెరుగైన జట్టుతో బరిలోకి దిగడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించాడు.
ఇదీ చదవండి: పాక్‌ను ఛీకొట్టి.. చిన్న జట్టులోకి వెళ్లిపోయాడు!


