PC: England cricket
పాకిస్తాన్, శ్రీలంకతో జరగనున్న ముక్కోణపు వన్డే సిరీస్ కోసం 18 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ సందర్భంగా సెలక్టర్లు కొన్ని అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత లెగ్ స్పిన్నర్ మేసన్ క్రేన్‌కు ఇంగ్లీష్ సెలక్టర్లు పిలుపునిచ్చారు.
అతడు చివరగా 2018లో ఇంగ్లండ్ తరపున ఆడాడు. అతడితో పాటు యువ పేసర్ హెన్రీ క్రోకోంబ్‌కు కూడా జట్టులో చోటు దక్కింది. అదేవిధంగా శ్రీలంకతో వన్డే సిరీస్‌కు గాయం కారణంగా దూరమైన స్పిన్నర్ అదిల్ రషీద్, ఆల్‌రౌండర్ సామ్ కుర్రాన్ తిరిగి జట్టులోకి వచ్చారు.
వీరిద్దరూ పూర్తి ఫిట్‌నెస్ సాధించడంతో తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్దమయ్యారు. ఇక ఈ ట్రైసిరీస్ నుంచి స్టార్ పేసర్ జోఫ్రా అర్చర్‌కు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ఆర్చర్‌తో పాటు జోస్ బట్లర్ కూడా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. కాగా పాక్ వేదికగా అక్టోబర్ 9 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్ వన్డే వరల్డ్‌కప్-2027 సన్నాహకాల్లో భాగంగా జరగనుంది.
ట్రైసిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు
హ్యారీ బ్రూక్, గస్ అట్కిన్సన్, సోనీ బేకర్, టామ్ బాంటన్, జేమ్స్ కోల్స్, జోర్డాన్ కాక్స్, మేసన్ క్రేన్, హెన్రీ క్రోకోంబ్, సామ్ కర్రన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, జో రూట్, జోష్ టంగ్
చదవండి: ఏ పిచ్ మీదైనా పరుగులు చేయడం అంత ఈజీ కాదు: గంభీర్‌కు గిల్ కౌంటర్


