క్యాన్సర్ అనగానే ప్రాణ భయంతో వణికిపోతారు. ఎందుకంటే ఏళ్ల తరబడబి కీమో థెరపీలు, సర్జరీలు అంటూ ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. పైగా కీమో థెరపీ సైడ్ ఎఫెక్ట్స్ తీవ్రంగా బాధిస్తాయి. అయినా కూడా కొన్ని రకాల క్యాన్సర్లు పూర్తిగా తగ్గుతాయన్న నమ్మకం ఉండదు. నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ పరీక్షలు చేయించుకుంటూ, అవసరమైతే చికిత్స తీసుకుంటూ ఉండాలి. అలా బ్రెయిన్ క్యాన్సర్ ఉందని ఒక మహిళ సుదీర్ఘ కాలంపాటు కీమోథెరపీ తీసుకుంది. ఇలా ఒకటీ రెండేళ్లు కాదు ఏకంగా 11 ఏళ్ల పాటు కీమోథెరపీ చేయించుకుంది. తీరా చూస్తే వైద్యులు భయంకరమైన విషయాన్ని వెల్లడించారు.
బీబీసీ కథనం ప్రకారం, బెక్ కీ జోన్స్ (Becky Jones) అనే మహిళ 2012లో తీవ్రమైన మైగ్రేన్ తలనొప్పితో బాధపడింది. ఆమెకు తీసిన బ్రెయిన్ స్కానింగ్‌లో ఒక కణితి (Lesion) కనిపించింది. వైద్యులు దానిని ట్యూమర్‌గా భావించి క్యాన్సర్‌గా చికిత్స ప్రారంభించారు. చికిత్స ఆపితే ప్రాణాలకే ముప్పు అని వైద్యులు పదేపదే చెప్పడంతో ఆమె దాన్ని విశ్వసించి, చాలా పట్టుదలగా చికిత్సతీసుకుంది. కానీ 2025లో ఆమె వైద్య రికార్డులను పరిశీలించిన స్వతంత్ర న్యూరో సర్జన్లు, రేడియాలజిస్టులు ఆమెకు అసలు బ్రెయిన్ క్యాన్సరే లేదన్న దిగ్భ్రాంతికరమైన నిజాన్ని వెల్లడించారు.
ఇదీ చదవండి: ఫ్రిజ్ పేలి ఒకే కుటుంబంలో నలుగురు సజీవ దహనం
నిజం బయటపడిందిలా
ఇటీవల ఆమె కేసును స్వతంత్ర నిపుణులు మళ్లీ పరిశీలించడంతో అసలు విషయం బయటపడింది. ఆ స్కానింగ్‌లలో కనిపించింది ట్యూమర్ కాదని, నాడీ వ్యవస్థకు సంబంధించిన వాపు వల్ల ఏర్పడే 'ట్యుమేఫాటివ్ డిమైలినేషన్' (Tumefactive Demyelination) అని తేలింది. ఇది చూడటానికి ట్యూమర్‌లా కనిపిస్తుంది కానీ క్యాన్సర్ కాదు.
ఇదీ చదవండి: ముగ్గురు బిడ్డల హత్య : ఆ తల్లిని బహిరంగ ఉరితీయాలంటూ సంచలన వ్యాఖ్యలు
కన్నీటి పర్యవంతమైన బాధితురాలు
ఆమె తన భాగస్వామిని కలిసిన కొద్ది కాలానికే, పోలీసు వృత్తిలో చేరాలని కలలు కనేది, కానీ అకస్మాత్తుగా ఆమె భవిష్యత్తు అంధకారంగా మారింది. అనుభవజ్ఞుడైన క్యాన్సర్ నిపుణుడు చేసిన ఈ నిర్ధారణ, ఆమె జీవితాన్ని మార్చేసింది. 11 ఏళ్ల కీమోథెరపీ చికిత్సకు దారితీసింది. ఆమె తరచుగా అనారోగ్యానికి గురయ్యేది, కుటుంబ కార్యక్రమాలలో పాల్గొనలేకపోయింది, ఆమె వృత్తికి ఆటంకం కలిగింది మరియు నిరంతరం ఆందోళనతో కుంగిపోయింది. తీరా 34 ఏళ్ల వయసులో, ఆమెకు అసలు క్యాన్సర్ లేదని, స్టెరాయిడ్లతో చికిత్స చేయగలిగే మెదడు వాపు మాత్రమే ఉందని ఇటీవల తెలుసుకుంది. ఇంగ్లండ్‌లోని వెస్ట్ మిడ్‌లాండ్స్‌లోని కోవెంట్రీలోని కన్సల్టెంట్ ప్రొఫెసర్ ఇయాన్ బ్రౌన్ తన జీవితాన్ని నాశనం చేశారని జోన్స్ అన్నారు. ఇద్దరు పిల్లల తల్లి అయిన ఆమె, ఈ అనవసరమైన క్యాన్సర్ చికిత్స కారణంగా యూనివర్సిటీ హాస్పిటల్స్ కోవెంట్రీ అండ్ వార్విక్‌షైర్ (UHCW) NHS ట్రస్ట్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్న 40 మందికి పైగా రోగులలో ఒకరు.
"నాకు అసలు బ్రెయిన్ ట్యూమరే లేదు. తప్పుడు రోగ నిర్ధారణ (Misdiagnosis) వల్ల నా యువ జీవితంలో ఎక్కువ భాగం ఎలాంటి కారణం లేకుండానే నూనెలో కాలుతున్నట్లు నరకం అనుభవించాను" అని జోన్స్ కన్నీటి పర్యంతమయ్యారు. ఇంగ్లండ్‌లోని వెస్ట్ మిడ్‌లాండ్స్‌లోని కోవెంట్రీలోని కన్సల్టెంట్ ప్రొఫెసర్ ఇయాన్ బ్రౌన్ తన జీవితాన్ని నాశనం చేశారని జోన్స్ అన్నారు. ఈ నిజం తెలిసినప్పుడు కుటుంబ సభ్యులందరూ కంటతడి పెట్టుకున్నట్లు ఆమె తరఫు న్యాయవాది టిన్సే తెలిపారు.
ఇదీ చదవండి: బిర్యానీ గణేశుడు : షాపు యజమానికి భారీ షాక్
Second Opinion ప్రాముఖ్యత
ఒక తీవ్రమైన వ్యాధి నిర్ధారణ జరిగినప్పుడు, అది అరుదైనదైనప్పుడు లేదా సంక్లిష్టమైనదైనప్పుడు మరో వైద్య నిపుణుడిని సంప్రదించడం ఎంత ముఖ్యమో ఈ ఘటన తెలియజేస్తోంది.క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధి సోకిందంటే ఒక వ్యక్తి కుటుంబ నిర్ణయాలు, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి, మానసిక ఆరోగ్యం అన్నీ పూర్తిగా మారిపోతాయి. ఏళ్ల తరబడి కీమోథెరపీ చేయించుకోవడం వల్ల శారీరకంగా, మానసికంగా ఎంతో క్షోభను అనుభవించాల్సి వస్తుంది. ఎవరికైనా క్లిష్టమైన సమస్యలు ఎదురైనప్పుడు 'ఫ్రెష్ ఐస్'తో (కొత్త కోణంలో) పరీక్షించడం ఎంత అవసరమో ఈ ఉదంతం నిరూపిస్తోంది.


