ఇంగ్లండ్‌ తుది జట్టు ప్రకటన.. విధ్వంసకర బ్యాటర్‌ అరంగేట్రం | England Playing XI Vs Sri Lanka For 1st T20I Announced | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ తుది జట్టు ప్రకటన.. విధ్వంసకర బ్యాటర్‌ అరంగేట్రం

Sep 14 2026 9:22 PM | Updated on Sep 14 2026 9:27 PM

England Playing XI Vs Sri Lanka For 1st T20I Announced

source: X

మూడు మ్యాచ్‌ల టీ20, వన్డే సిరీస్‌ కోసం శ్రీలంక జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో తొలుత టీ20 సిరీస్‌ జరుగనుంది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్‌ సెప్టెంబర్‌ 15న సౌతాంప్టన్‌ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్‌ కోసం ఇంగ్లండ్‌ తుది జట్టును ఇవాళ ప్రకటించారు. 

విధ్వంసకర బ్యాటర్‌, ఓపెనర్‌ అనెరిన్ డొనాల్డ్ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నాడు. ఫిల్ సాల్ట్ కుడి తొడ కండరాల గాయంతో సిరీస్‌కు దూరం కావడంతో అనెరిన్ డొనాల్డ్‌కు అవకాశం దక్కింది. జేకబ్‌ బేతెల్‌ స్థానంలో వచ్చిన జోర్డన్‌ కాక్స్‌కు కూడా తుది జట్టులో చోటు లభించింది. 

ఆల్‌రౌండర్లుగా జాక్స్‌,  డాసన్‌, ఓవర్టన్‌ తమ స్థానాలను పదిలంగా ఉంచుకున్నారు. స్టార్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌కు విశ్రాంతినిచ్చారు. అతడి స్థానంలో సోనీ బేకర్‌కు అవకాశం లభించింది. స్పిన్ విభాగంలో అనుభవజ్ఞుడైన ఆదిల్ రషీద్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. పేస్ విభాగంలో జోష్ టంగ్ కూడా తుది జట్టులో ఉన్నాడు. ఈ మ్యాచ్‌ భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు ప్రారంభమవుతుంది.

శ్రీలంకతో తొలి టీ20కి ఇంగ్లండ్ ప్లేయింగ్ ఎలెవన్
జోస్ బట్లర్ (వికెట్ కీపర్), అనెరిన్ డొనాల్డ్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోర్డాన్ కాక్స్, టామ్ బాంటన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జేమీ ఓవర్టన్, సోనీ బేకర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్

ఇదీ చదవండి: టీమిండియాకు ఊహించని షాక్‌


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement