source: BCCI X
ఆఫ్ఘనిస్తాన్‌తో రెండో టీ20కి ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. స్టార్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడని సమాచారం. వరుణ్ సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే ఏషియన్ గేమ్స్‌లోనూ ఆడటం అనుమానమేనని తెలుస్తోంది.
వరుణ్ సైడ్ స్ట్రెయిన్‌తో బాధపడుతున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. నిన్న జరిగిన తొలి టీ20లో వరుణ్ అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియా విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో అతడు నాలుగు ఓవర్లలో కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ తీశాడు.
న్యూఢిల్లీలో రేపు జరుగబోయే రెండో టీ20లో వరుణ్ లేకపోతే టీమిండియా ఇబ్బంది పడవచ్చు. ఇటీవలికాలంలో వరుణ్ టీ20 ఫార్మాట్‌లో భారత్ విజయాల్లో అత్యంత కీలకపాత్ర పోషిస్తున్నాడు. రెండో టీ20కి వరుణ్ దూరమైతే అతడి స్థానంలో రవి బిష్ణోయ్ తుది జట్టులోకి రావచ్చు.
కాగా, ఆఫ్ఘనిస్తాన్ జట్టు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లు న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్నాయి. తొలి టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బౌలర్లు రెచ్చిపోగా.. ఆతర్వాత బ్యాటర్లు తమ పని కానిచ్చారు. బౌలింగ్‌లో వరుణ్‌తో పాటు అర్షదీప్ (4-0-19-3), బుమ్రా (4-0-26-1), అక్షర్ పటేల్ (4-0-27-1) సత్తా చాటగా.. బ్యాటింగ్‌లో అభిషేక్ (32 బంతుల్లో 82; 7 ఫోర్లు, 7 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (33 బంతుల్లో 42; 5 ఫోర్లు, సిక్స్) మెరుపులు మెరిపించారు.
ఇదీ చదవండి: టీమిండియాకు ఊహించని షాక్


